Begin typing your search above and press return to search.

మ్యాగజైన్ పై హీటేక్కిస్తున్న తెలుగమ్మాయి

నాగ చైతన్య జోష్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రేయా ధన్వంతరి సందీప్ కిషన్ స్నేహగీతం సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 3:30 PM GMT
మ్యాగజైన్ పై హీటేక్కిస్తున్న తెలుగమ్మాయి
X

శ్రేయా ధన్వంతరి… ఈ పేరు ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ టాలీవుడ్ లోనే నటిగా కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు, వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతున్న అందాల భామ. నాగ చైతన్య జోష్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రేయా ధన్వంతరి సందీప్ కిషన్ స్నేహగీతం సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.


ఆ తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దీంతో ముంబై వెళ్ళిపోయిన ఈ బ్యూటీ అక్కడ మోడలింగ్ లో అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది. తరువాత వై చీట్ ఇండియా అనే మూవీలో ఇమ్రాన్ హష్మీకి జోడీగా శ్రేయా ధన్వంతరి నటించింది. తరువాత లూప్ లుపేట, చుప్, అన్ పాసెడ్ సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఆమె చేసిన రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.

మరో వైపు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించింది. గత ఏడాది వచ్చిన దుల్కర్ లీడ్ రోల్ లో వచ్చిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ లో కూడా శ్రేయా ధన్వంతరి నటించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా నటిగా గుర్తింపు వస్తే సోషల్ మీడియాలో మాత్రం మరో ఫేమ్ సంపాదించింది. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లని శ్రేయా ధన్వంతరి షేర్ చేస్తూ ఉంటుంది.

అందాల ప్రదర్శనలో పెద్దగా హద్దులు లేకుండా చేసే ఆమె గ్లామర్ షోకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు విమెన్ ఫిట్ నెస్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ప్రత్యేకంగా ఫోజులిచ్చింది. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి పెర్ఫెక్ట్ షేప్స్ తో హాట్ స్టిల్ లో శ్రేయా ధన్వంతరి మాయ చేస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విమెన్ ఫిట్ నెస్ మ్యాగజైన్ కవర్ పేజీపై పబ్లిష్ అయినా శ్రేయా ధన్వంతరి ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో ఆ సంస్థ షేర్ చేసింది. శ్రేయా ధన్వంతరి బయోని కూడా అందులో ప్రత్యేకంగా స్టోరీలా రాసుకొచ్చింది. ఈ ఫోటోని చూసిన తర్వాత బాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న తెలుగమ్మాయిలని గుర్తు చేసుకుంటున్నారు. శ్రేయా తరహాలోనే శోభిత దూళిపాళ్ల కూడా బాలీవుడ్ లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ సక్సెస్ అయ్యింది .