Begin typing your search above and press return to search.

శ్రేయ హీటెక్కించే గ్లామర్.. స్టన్నింగ్

అప్పుడెప్పుడో జోష్ సినిమాలో చాలా హోమ్లీ పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో హీటెక్కించే ఫోటోలుతో స్టన్ అయ్యేలా దర్శనమిస్తోంది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 11:59 AM GMT
శ్రేయ హీటెక్కించే గ్లామర్.. స్టన్నింగ్
X

చూడగానే తన చిరునవ్వుతో ఆకట్టుకునే తెలుగమ్మాయి శ్రేయ ధన్వంతరి. ఈ బ్యూటీ కెరియర్ మొదట్లో మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక టాలీవుడ్ లో అమ్మడికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఎక్కువగా హీరోయిన్ గానే అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. ఇక మొదట్లో ఆమె అక్కినేని నాగచైతన్య జోష్ సినిమాలో ఒక ఫ్రెండ్ పాత్రలో కనిపించింది.


ఇక ఆ తర్వాత స్నేహ గీతం అనే మరొక సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. అయితే ఆ పాత్రలు ఏమీ కూడా ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ఇక ఆ తర్వాత అమ్మడు ముంబైకి మాకం మార్చేసి అక్కడ బాలీవుడ్లో అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది. కొన్ని వెబ్ సిరీస్ లు టెలివిజన్ సీరియల్స్ లలో కూడా నటించింది.

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటూ వెళ్లిన శ్రేయ ధన్వంతరి సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల కాలంలో అయితే ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో అమ్మడు తన గ్లామర్ తో ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.

రీసెంట్ గా బ్లాక్ స్టైలిష్ డ్రెస్ లో అమ్మడు తన ఎద అందాలతో అందంగా కనిపించింది. అప్పుడెప్పుడో జోష్ సినిమాలో చాలా హోమ్లీ పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో హీటెక్కించే ఫోటోలుతో స్టన్ అయ్యేలా దర్శనమిస్తోంది. శ్రేయ ధన్వంతరి తన గ్లామర్ తో ఫాలోవర్స్ సంఖ్యను గట్టిగానే పెంచుకుంటుంది. అందం అభినయం అలాగే సింపుల్ యాక్టింగ్ స్కిల్స్ కలిగిన శ్రేయ మంచి టాలెంటెడ్ అయినప్పటికీ కూడా మెరుగైన అవకాశాలు అనకు కలిసి రావడం లేదు.

ఇక చివరిగా ఆమె ఎక్కువగా క్రేజ్ అందుకుంది మాత్రం స్కామ్ 1992 వెబ్ సిరీస్ ద్వారానే. ఆ సిరీస్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది. అనంతరం కొన్ని చిన్న చిన్న సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది. ఇక ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ విధంగా తన గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తోంది. మరి ఈ అందంతో అమ్మడు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.