Begin typing your search above and press return to search.

అభిమానికి మ‌ర్చిపోలేని గిఫ్టిచ్చిన‌ శ్రేయా ఘోషాల్

అందులో భాగంగానే శ్రేయా ఘోషాల్ రీసెంట్ గా ఆమ్‌స్ట‌ర్‌డ్యామ్ లో కాన్స‌ర్ట్ ను నిర్వ‌హించారు.

By:  Tupaki Desk   |   9 July 2025 3:00 PM IST
అభిమానికి మ‌ర్చిపోలేని గిఫ్టిచ్చిన‌ శ్రేయా ఘోషాల్
X

ఇండియాలో ఎంతో ప్ర‌సిద్ధి చెందిన సింగ‌ర్స్ లో శ్రేయా ఘోషాల్ కూడా ఒక‌రు. సింగ‌ర్ గా ఎన్నో ఘ‌న‌త‌ల‌ను అందుకున్న శ్రేయా ఘోషాల్ ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం శ్రేయా ఓ వైపు సింగ‌ర్ గా ప‌లు సినిమాల్లో పాట‌లు పాడుతూనే మ‌రోవైపు ఆల్ హార్ట్స్ టూర్ పేరిట మ్యూజికల్ కాన్స‌ర్ట్ ను నిర్వ‌హిస్తూ త‌న ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపుతున్నారు.


అందులో భాగంగానే శ్రేయా ఘోషాల్ రీసెంట్ గా ఆమ్‌స్ట‌ర్‌డ్యామ్ లో కాన్స‌ర్ట్ ను నిర్వ‌హించారు. అక్క‌డ ఓ ప్రెగ్నెంట్ ఫ్యాన్ కు శ్రేయా మ‌ర్చిపోలేని జ్ఞాప‌కాన్నిచ్చారు. శ్రేయా త‌న అభిమానుల్లో ఒక‌రితో బ్యాక్ స్టేజ్ లో సంభాషిస్తున్న వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. కాన్స‌ర్ట్ అయిపోయాక శ్రేయా ద‌గ్గ‌ర‌కు ఓ ప్రెగ్నెంట్ లేడీ వ‌చ్చి త‌న‌కు శ్రేయా వాయిస్ పై ఉన్న ప్రేమ‌ను వ్య‌క్తం చేశారు.

ఆ టైమ్ లో శ్రేయా ఘోషాల్ మోకాళ్లపై కూర్చుని, త‌న అభిమాని బేబీ బంప్ ను చేత్తో సున్నితంగా నిమురుతూ పుట్ట‌బోయే బిడ్డ కోసం జోల‌పాట‌గా ప‌రిణీత సినిమాలోని పియు బోలే సాంగ్ ను పాడారు. శ్రేయా ఆ పాట పాడుతున్నంతసేపు త‌న అభిమాని క‌ళ్ల‌లో ఉన్న ఆనందం మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనంత‌గా ఉంది. శ్రేయా పాట‌తో భావోద్వేగానికి గురైన ఆ అభిమాని శ్రేయాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా ప‌రిణీత సినిమాలోని పియు బోలే సాంగ్ ను సోనూ నిగ‌మ్ తో క‌లిసి శ్రేయా ఘోష‌ల్ పాడ‌గా, ఆ సాంగ్ లో సైఫ్ అలీ ఖాన్, విద్యా బాల‌న్ న‌టించారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా ఆ వీడియో చూసి నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాల‌ను కామెంట్స్ రూపంలో రాస్తున్నారు. శ్రేయా పాట‌కు ఆ లోప‌లున్న బిడ్డ ఎంత సంతోషంగా డ్యాన్స్ చేసిందో అని ఒక‌రంటే, ఆ పుట్ట‌బోయే బిడ్డ‌కు ఎంత మంచి ఎక్స్‌పీరియెన్స్ అని మ‌రొక‌రు కామెంట్ చేశారు. ఈ విష‌యంలో శ్రేయా ఘోషాల్ అందరి నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు.