Begin typing your search above and press return to search.

కజిన్ సీమంతం వేడుకలో ‘సాహో’ బ్యూటీ

ప్రియాంక్‌ శర్మ భార్య షాజా మొరానీ యొక్క బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   6 Jan 2024 5:48 AM GMT
కజిన్ సీమంతం వేడుకలో ‘సాహో’ బ్యూటీ
X

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ జాబితా చాలా పెద్దదే. అయితే కొద్ది మంది హీరోయిన్స్ మాత్రం తమ సొంత కష్టంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్టార్‌ హీరోయిన్ లుగా ఎదుగుతున్నారు. వారిలో ఒకరు సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.


ప్రభాస్ కు జోడీగా సాహో చిత్రంలో నటించడం ద్వారా సౌత్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్‌ అయిన ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా సందడి చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన కజిన్‌ భార్య సీమంతం వేడుకలో మెరిసి సోషల్‌ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రియాంక్‌ శర్మ భార్య షాజా మొరానీ యొక్క బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో శ్రద్దా కపూర్‌ అనార్కలీ డ్రెస్ ను ధరించి కనిపించింది. చాలా మంది అందమైన ఆడవారి మధ్య అంతకు మించి అన్నట్లుగా శ్రద్ద కపూర్‌ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శ్రద్ద కపూర్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ముందు ముందు ఈ అమ్మడి నుంచి తెలుగు లో మరో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక తెలుగు సినిమా మేకర్స్ ఈ అమ్మడి తో చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.