Begin typing your search above and press return to search.

క్రిష్ 4పై లీకులిచ్చిన 'సాహో' శ్ర‌ద్ధ‌!

అయితే క్రిష్ ఫ్రాంచైజీ అభిమానులకు ఇంత‌లోనే శుభవార్త అందింది. అందాల క‌థానాయిక‌ శ్రద్ధా కపూర్ కొన్ని క్రిప్టిక్ సెల్ఫీలను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 2:30 AM GMT
క్రిష్ 4పై లీకులిచ్చిన సాహో శ్ర‌ద్ధ‌!
X

గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించిన 'కోయి...మిల్ గయా' 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం థియేటర్లలో తిరిగి విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. వారంతా నోస్టాల్జిక్ ట్రిప్‌లో ఉన్నారు. హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్‌తో కలిసి ఇంటర్వ్యూలలో త‌న‌ జ్ఞాపకాలను పంచుకున్నారు. అంతేకాదు గ‌తంలో తండ్రి కొడుకులు ఇరువురు ప‌లు సంద‌ర్భాల్లో క్రిష్ 4 గురించి ప్ర‌స్థావించారు. ఇప్పుడు మ‌రోసారి క్రిష్ 4 లాంచ్ డేట్ కోసం అభిమానులు ఆస‌క్తిక‌రంగా వేచి చూస్తున్నారు. అయితే తండ్రీకొడుకుల ద్వయం నుండి దీని గురించి పెద్దగా అప్‌డేట్ రాలేదు!

అయితే క్రిష్ ఫ్రాంచైజీ అభిమానులకు ఇంత‌లోనే శుభవార్త అందింది. అందాల క‌థానాయిక‌ శ్రద్ధా కపూర్ కొన్ని క్రిప్టిక్ సెల్ఫీలను షేర్ చేసింది. ఈ ఫోటోలు రిలీజ్ చేయ‌డ‌మేగాక‌..''జాదూ లాంటి ధూప్ కావాలి'' అని రాసింది. శ్రద్ధా పోస్ట్‌పై హృతిక్ రోషన్ వెంట‌నే వ్యాఖ్యానించాడు. ''అత‌డు వస్తున్నాడు.. అతడితో చెబుతాను'' అని వ్యాఖ్యానించాడు. దీనికి శ్ర‌ద్ధా ఎంతో ఉద్వేగంతో స్పందిస్తూ ''అసలు ??? ఎప్పుడు ఎక్కడ చెప్పాలో చెప్పు'' అని అడిగాడు. అభిమానులందరూ ఈ ఇద్ద‌రి న‌డుమా ప‌రాచికం చూసిన తర్వాత తమ ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. ఒక అభిమాని ఇలా ఊహించాడు. శ్రద్ధాకపూర్ క్యా బాత్ హై మామ్ !! క్రిష్ 4 లో న‌టిస్తున్నారా? అని అడిగారు.

చాలా మంది నెటిజ‌నులు శ్రద్ధా -హృతిక్ జంట‌గా కలిసి ఒక చిత్రంలో చూడాలనుకుంటున్నామ‌ని తెలిపారు. కొంద‌రైతే క్రిష్ 4లోనే ఈ జంట‌ను చూడాల‌ని ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. అసలు క్రిష్ 4లో శ్రద్దా భాగమేనా అనేది ఊహించ‌లేనిది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఫ్రాంఛైజీతో శ్ర‌ద్ధాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రియాంక చోప్రా, కంగ‌న లాంటి మేటి క‌థానాయిక‌లు క్రిష్ ఫ్రాంఛైజీలో న‌టించారు. ప్రస్తుతానికి హృతిక్ 'ఫైటర్'లో న‌టిస్తున్నాడు. ఇది జనవరి 2024లో విడుదల కానుంది. హృతిక్ ఇటీవలే తన పరివర్తన్ పోస్ట్‌తో అందరిలో స్ఫూర్తిని నింపాడు.