Begin typing your search above and press return to search.

2024 లో ఆ బ్యూటీ కొత్త‌గా లాంచ్ అవుతుందా?

అయితే న్యూ ఇయ‌ర్ 2024 లో మాత్రం అమ్మ‌డు అన్ని లెక్క‌లు స‌రి చేస్తానంటోంది. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు గురించి రివీల్ చేసింది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 11:30 PM GMT
2024 లో ఆ బ్యూటీ కొత్త‌గా లాంచ్ అవుతుందా?
X

మూడేళ్ల గా శ్ర‌ద్ద‌క‌పూర్ కెరీర్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏడాదికి రెండు మూడు సినిమాల‌తో మెరిసిన బ్యూటీ మూడేళ్ల‌గా ఒక సినిమానే కానా క‌ష్టంగా రిలీజ్ చేస్తుంది. అందులోనూ అవి యావ‌రేజ్ చిత్రా లుగా బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌వ‌డంతో శ్ర‌ద్ద క‌పూర్ పేరు వినిపించ‌డం లేదు. దీంతో సోష‌ల్ మీడియాలో వేర్ ఈజ్ శ్ర‌ద్దా అంటూ అభిమానులు అడిగిన సంద‌ర్భాలెన్నో. గ‌తేడాది కూడా ఒక్క సినిమా తోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.


అయితే న్యూ ఇయ‌ర్ 2024 లో మాత్రం అమ్మ‌డు అన్ని లెక్క‌లు స‌రి చేస్తానంటోంది. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు గురించి రివీల్ చేసింది. అవేంటో ఆమె మాట‌ల్లోనే. ఈ సంవ‌త్స‌రం నాకెంతో కొత్త‌గా ఉండ‌బోతుంది. భిన్న‌మైన సినిమాల‌తో మీ ముందుకు రాబోతున్నా. ప్ర‌స్తుతం కొన్ని సినిమాల‌కు క‌మిట్ అయ్యాను. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతాను. ఇప్ప‌టివ‌ర‌కూ ప్రేమ క‌థ‌లు.. కామెంటీ ఎంట‌ర్ టైన్మెం ట్స్ తో అల‌రించిన నేను పౌరాణిక క‌థ ఆధారంగా ఓ సినిమా చేస్తున్నా.

ఆ సినిమా కోసం ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం అవుతున్నా. అలాగే టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో మ‌రో సినిమా చేస్తు న్నా. ఈ ఏడాది మొత్తం గా మునుపెన్న‌డు చూడని విధంగా ప్రేక్ష‌కాభిమానులు తెర‌పై చూస్తారు` అని అంది. మొత్తానికి 2024 లో శ్ర‌ద్దా క‌పూర్ భారీగానే సినిమాలు క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. వాటిలో ఎక్కువ‌గా తనిన సోలోగా ప్రోజెక్ట్ చేసే సినిమాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం శ్ర‌ద్దా క‌పూర్ `స్త్రీ-2` అనే సినిమాలో న‌టిస్తోంది. ఈసినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్త్రీ`అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. కామెడీ హార‌ర్ లో శ్ర‌ద్దా కపూర్ పాత్ర ఆద్యంతం ఆక‌ట్టుకుంది. న‌టిగా శ్ర‌ద్దా క‌పూర్ ని మ‌రో మెట్టు పైకెక్కించిన చిత్ర‌మ‌ది. క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. 18 కోట్ల‌తో నిర్మించిన చిత్రం 180 కోట్ల‌కు పైగా వ‌సూళ్లను సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా `స్త్రీ-2`ని తెర‌పైకి తెస్తున్నారు.