Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : ఈమె అందానికి 'సాహో' అనాల్సిందే

తాజాగా సాహో బ్యూటీ ఇలా క్లీ వేజ్‌ షో చేస్తూ నడుము అందాన్ని చూపిస్తూ ఉంటే కంటి రెప్ప పడటం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 4:27 AM GMT
పిక్‌ టాక్ : ఈమె అందానికి సాహో అనాల్సిందే
X

బాలీవుడ్‌ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా తన కష్టంతో నిలిచిన ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది. వరుస సినిమాలతో అలరిస్తున్న ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో కూడా రెగ్యులర్‌ గా సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం.





సౌత్‌ ప్రేక్షకులకు సాహో సినిమా తో పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కూడా తెలుగు మరియు తమిళంలో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం హిందీ సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు ముందు ముందు కూడా సౌత్ లో నటించే అవకాశాలు కనిపించడం లేదు.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసే అందాల ఆరబోత ఫోటోలు మాత్రం సౌత్ లో కూడా తెగ వైరల్‌ అవ్వడం జరుగుతుంది.

ఈమె అందాలకు ఫిదా అయ్యే సౌత్ ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. హీరోయిన్ గా ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఎప్పటికప్పుడు నెటిజన్స్ సాహో అంటూనే ఉన్నారు.

తాజాగా సాహో బ్యూటీ ఇలా క్లీ వేజ్‌ షో చేస్తూ నడుము అందాన్ని చూపిస్తూ ఉంటే కంటి రెప్ప పడటం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ లో అందాల ఆరబోత చేస్తే సాహో నీ అందానికి అనకుండా ఎలా ఉంటామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్‌ అందాల ఆరబోతకు పిచెక్కి పోతున్నామంటున్నారు.