Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌లానే లంబోర్ఘిణి య‌జ‌మాని

శ్రద్ధా కపూర్ లంబోర్ఘిని హురాకాన్ టెక్నికాను రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. ద‌స‌రా ముహూర్తాన కొత్త కార్ త‌న ఇంటికి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   26 Oct 2023 1:30 AM GMT
ప్ర‌భాస్‌లానే లంబోర్ఘిణి య‌జ‌మాని
X

ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్ల‌ను ఛేజిక్కించుకోవ‌డంలో సినీసెల‌బ్రిటీలు ఎప్పుడూ ముందుంటారు. ఇంత‌కుముందే డార్లింగ్ ప్ర‌భాస్ అల్ట్రా రిచ్ విదేశీ కార్ లంబోర్ఘిణికి య‌జ‌మాని అయ్యాడు. టాలీవుడ్, బాలీవుడ్ లో ఇప్పుడు ప‌లువురికి లంబోర్ఘిణి సొంత‌మైంది. ఇప్పుడు ఈ జాబితాలోకి సాహో బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ పేరు చేరింది.

శ్రద్ధా కపూర్ లంబోర్ఘిని హురాకాన్ టెక్నికాను రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. ద‌స‌రా ముహూర్తాన కొత్త కార్ త‌న ఇంటికి వ‌చ్చింది. లంబోర్ఘిణి కొత్త బ్రాండ్ టెక్నికా ఆగస్టు 2022 నుంచి భారతదేశంలో అందుబాటులో ఉంది. దీనిని ప‌లువురు సెల‌బ్రిటీలు సొంతం చేసుకున్నా మ‌హిళా సెల‌బ్రిటీల్లో ఇదే మొద‌టిసారి. మ‌రోవైపు 'స్ట్రీ 2' షూటింగ్‌లో బిజీగా ఉన్న శ్రద్ధా కపూర్ ద‌స‌రా సెల‌వుల‌ను కుటుంబంతో క‌లిసి ఆస్వాధించింది.

ఇప్పుడు ఖ‌రీదైన కార్ ని కొనుగోలు చేసిన ఆనందం త‌న‌లో ఆవ‌ర్ణ‌మైంది. ఈ ఆనందాన్ని మాట‌ల్లో చెప్ప‌లేన‌ని తెలిపింది. ''ఈ రోజు నాకు నిజంగా ప్రత్యేకమైన క్షణం!' అంటూ శ్ర‌ద్ధా ఆనందం వ్య‌క్తం చేసింది. ఇది ముంబైలో మరపురాని మొదటిది - ఒక లంబోర్ఘిని అద్భుతమైన స్త్రీకి ద‌క్కింది'' అని శ్రద్ధా కపూర్ స్నేహితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది.

సూపర్ కార్ ఎప్పుడూ కారు మాత్రమే కాదు - ఇది అడ్డంకులను తొల‌గించి మీ కలలను నిర్భయంగా కొనసాగించడానికి ప్రతీక.. అని త‌న స్నేహితురాలు పేర్కొంది. దీనిపై శ్రద్ధా కపూర్ స్పందిస్తూ, ''మంచి మాటలకు చాలా ధన్యవాదాలు.... అంటే అత్యంత స్ఫూర్తిదాయకమైన బాస్ ఉమెన్ నుండి వస్తోంది!!! గర్ల్ పవర్ అన్ని విధాలా''అని వ్యాఖ్య‌ను జోడించింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... శ్రద్ధా కపూర్ మడాక్ ఫిల్మ్స్‌తో కలిసి స్ట్రీ 2 కోసం ప‌ని చేస్తోంది. చివరిగా తూ ఝూతీ మెయిన్ మక్కార్‌లో కనిపించిన ఈ భామ వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తోంది.