Begin typing your search above and press return to search.

చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న శ్రద్దా.. స్టన్నింగ్!

ఇక చీర కొంగు కాస్త పక్కకు జరిపి తన ఎద అందాలతో కూడా అమ్మడు మాయాజాలాన్ని చల్లేసింది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 6:25 PM GMT
చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న శ్రద్దా.. స్టన్నింగ్!
X

కొంతమంది హీరోయిన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ లు అందుకోక పోయినప్పటికీ కూడా గ్లామర్ తోనే వారికంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఆ రూట్ లో మంచి ఫేమ్ అందుకున్న బ్యూటీలలో శ్రద్ధ దాస్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చాలా అవకాశాలు వచ్చాయి.


కానీ మెయిన్ హీరోయిన్ గా మాత్రం అమ్మడు పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఎక్కువగా గెస్ట్ తరహా గ్లామరస్ పాత్రలతో కనిపించింది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక అమ్మడు 2008 నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మొదటి సినిమా సిద్దు ఫ్రం శ్రీకాకుళం పర్వాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి.


ఇక అల్లు అర్జున్ ప్రభాస్ వంటి స్టార్స్ తో అయితే కొన్ని పాత్రలతో స్క్రీన్ అయితే షేర్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో కూడా ఆకట్టుకుంటూనే ఉంది. వయసు 35 దాటినా కూడా ఇంకా పాతికేళ్ల హీరోయిన్ తరహా లోనే అమ్మడు తన అందంతో ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా చీరలో శ్రద్ధాదాస్ కనిపించిన విధానం కుర్రాళ్ళ మనసును దోచేసింది.

గతంలో బికినీలో కూడా కనిపించిన ఈ బ్యూటీ ఈసారి చీరలో మాత్రం అంతకుమించి అనేలా అందంగా ఉంది అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక చీర కొంగు కాస్త పక్కకు జరిపి తన ఎద అందాలతో కూడా అమ్మడు మాయాజాలాన్ని చల్లేసింది. తన చూపులతో కూడా కట్టిపడేసిన శ్రద్ధాదాస్ ఎంతమంది గ్లామరస్ బ్యూటీలు వచ్చినా కూడా తనకు పోటీ ఇవ్వలేరు అనే విధంగా అయితే దర్శనమిస్తోంది.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ఒకవైపు తెలుగులో చిన్న తరహా పాత్రలు చేస్తూనే మరోవైపు కన్నడ హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. చివరగా తెలుగులో అయితే అమ్మడు ఏక్ మినీ కథ సినిమాలో నటించింది. కానీ అదేమీ అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఇక ప్రస్తుతం అయితే తెలుగులోనే రెండు చిన్న సినిమాలలో నటిస్తోంది. మరి ఆ సినిమాలు ఎంతవరకు గుర్తింపును అందిస్తాయో చూడాలి.