Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : నిలువెత్తు అందాల జలకన్య

ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు దాటింది. ఇన్నాళ్ల ఆమె సినీ కెరీర్‌ లో ఎన్నో సినిమాల్లో నటించింది... అయితే ఆమెకు సరైన బ్రేక్‌ మాత్రం దక్కలేదు

By:  Tupaki Desk   |   8 March 2024 9:35 AM GMT
పిక్ టాక్ : నిలువెత్తు అందాల జలకన్య
X

అల్లరి నరేష్‌ తో కలిసి అప్పుడెప్పుడో 2008 లో సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాలో హీరోయిన్‌ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్దా దాస్‌. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు దాటింది. ఇన్నాళ్ల ఆమె సినీ కెరీర్‌ లో ఎన్నో సినిమాల్లో నటించింది... అయితే ఆమెకు సరైన బ్రేక్‌ మాత్రం దక్కలేదు.

స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్‌ రాలేదు, భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు దక్కించుకోలేదు. అయినా కూడా పట్టుదలతో తన అందంతో ఇన్నాళ్లు సినీ కెరీర్‌ ను కొనసాగిస్తూ వచ్చింది. ఇంకా కూడా సినిమాలు, సిరీస్ ల్లో చిన్న లేదా పెద్ద పాత్రలు చేస్తూ కెరీర్‌ లో ముందుకు సాగుతుంది.

ఇంతగా కెరీర్‌ లో ముందుకు సాగడంకు కారణం అందాల ఆరబోత అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియా ద్వారా శ్రద్ద చేసే అందమైన ఫోటో షూట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. స్టార్‌ హీరోయిన్స్‌ కంటే అందంగా కనిపించే శ్రద్ద దాస్ కు అదృష్టం కలిసి రాపోవడం వల్ల స్టార్స్‌ సినిమాల్లో ఛాన్స్‌ రాలేదు. తాజాగా మరో అందమైన ఫోటో షూట్ తో నెట్టింట వైరల్‌ అవుతోంది.

శ్రద్ద నేడు మహిళ దినోత్సవం సందర్భంగా ఈ ఫోటోలను షేర్‌ చేసింది. చుట్టూ కొండలు, నీటి పై సాహస కన్య ఈ జల కన్య అన్నట్లుగా అందమైన ఫోజ్‌ ఇచ్చింది. లాంగ్ షాట్ లోనూ నిలువెత్తు అందాల జలకన్య అన్నట్లుగా శ్రద్ద దాస్‌ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉండటం వల్లే సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా కూడా రెగ్యులర్‌ గా వార్తల్లో కనిపిస్తూ ఉంది.

ముందు ముందు అయినా శ్రద్దకు అందంకు తగ్గ పాత్రలు, సినిమాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంత అందం కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం అవ్వద్దు కదా అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.