Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : శ్రద్దగా అందాల ఆరబోత

తాజాగా మరోసారి ఇన్‌స్టాలో అందాల ఫోటో షూట్ ని షేర్‌ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసే విధంగా ఫోజ్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 9:53 AM GMT
పిక్ టాక్ : శ్రద్దగా అందాల ఆరబోత
X

సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్ద దాస్‌. ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో స్టార్‌ హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాదు. అయినా కూడా అవకాశాల విషయంలో ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు.

వరుసగా పెద్ద సినిమాల్లో ఆఫర్లు రాకున్నా, కమర్షియల్ హిట్స్ దక్కకున్నా కూడా శ్రద్ధ దాస్ కి చిన్నా చితకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అందుకే ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు దాటినా కూడా ఇంకా కూడా సినిమాల్లో లేదా సిరీస్ ల్లో సందడి చేస్తోంది.

ఈ అమ్మడు సినిమాలు మరియు సిరీస్‌ లతో పాటు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కేవలం సోషల్ మీడియాలో అందాల ఆరబోత కారణంగానే ఈ అమ్మడు ఇన్నాళ్లుగా ఇండస్ట్రీ లో కొనసాగుతోంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మరోసారి ఇన్‌స్టాలో అందాల ఫోటో షూట్ ని షేర్‌ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసే విధంగా ఫోజ్ ఇచ్చింది. ఆ ఫోటో షూట్ లో అందాల శ్రద్ద లుక్స్ కి అంతా ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో అందంగా ఉన్న శ్రద్దకి దక్కాల్సిన గౌరవం మరియు ఆఫర్లు దక్కలేదు అంటూ ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.