Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మిర్ర‌ర్‌లో శ్ర‌ద్ధ‌ టోన్డ్ బాడీ

తాజాగా ఈ బెంగాళీ బ్యూటీ మిర్రర్ సెల్ఫీలను షేర్ చేయ‌గా అవి అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి

By:  Tupaki Desk   |   17 Dec 2023 8:56 AM GMT
ఫోటో స్టోరి: మిర్ర‌ర్‌లో శ్ర‌ద్ధ‌ టోన్డ్ బాడీ
X

తెలుగు, హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన పేరు శ్రద్ధాదాస్. గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో తెలుగు యువ‌త‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ జ‌ర్నీ ఆస‌క్తిక‌రం. తెలుగులో అవ‌కాశాలు రాక‌పోయినా ఇరుగు పొరుగు భాష‌ల్లో అవ‌కాశాలు అందుకుంది. సోష‌ల్ మీడియాల్లోను శ్ర‌ద్ధాకు మంచి ఫాలోయింగ్ ఉంది. చిట్టి పొట్టి దుస్తులలో అల్ట్రా-గ్లామ్ లుక్ ల‌తో క‌వ్వించినా..సొగసైన చీరలో వేడెక్కించినా శ్ర‌ద్ధా ప్ర‌త్యేక‌త వేరు.


తాజాగా ఈ బెంగాళీ బ్యూటీ మిర్రర్ సెల్ఫీలను షేర్ చేయ‌గా అవి అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి. ఒక ఫోటోలో శ్రద్ధా దాస్ మెరూన్ కలర్ స్పోర్ట్స్ బ్రా బ్లాక్ టైట్స్ ధరించి కనిపించింది. ఈ మిర్రర్ సెల్ఫీలో టోన్డ్ మిడ్‌రిఫ్‌(న‌డుము సొగ‌సు)ను ప్రదర్శించింది. రెండవ ఫోటోలో తన శరీరాన్ని హ‌త్తుకునే పట్టీల గౌను ధరించి కనిపించింది. శ్రద్ధా మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించింది. అద్దం లో సెల్ఫీ ఎమోజీలను పోస్ట్ చేసి క్యాప్షన్ లో సింపుల్ గా ఈమోజీల‌ను ఉంచింది. శ్ర‌ద్ధా అభిమానులు ఈ పోస్ట్‌కు రెడ్ హార్ట్ ఈమోజీలు, ల‌వ్ ఈమోజీల‌తో ప్ర‌తిస్పందించారు. ఆదివారం ఫండే- బ్లాక్ షాడో అంటూ అభిమానులు వ్యాఖ్యానించారు. ఓహో! ఆ నల్ల గౌను! అమేజింగ్ మేడమ్.. ఎందుకు చాలా అందంగా ఉన్నావు? అని మరొకరు ఆశ్చర్యపోయారు. మీరు అందాల రాణి! మీరు మీ శరీరంపై చాలా కష్టపడి పనిచేశారు అని ఒక‌రు కీర్తించారు.

శ్రద్ధా దాస్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. లాహోర్, సనమ్ తేరీ కసమ్, బాబూమోషాయ్ బందూక్‌బాజ్ వంటి హిందీ చిత్రాలలో తన నటనతో ఆక‌ట్టుకుంది. టాలీవుడ్ లో ఆర్య‌2, మొగుడు, గుంటూరు టాకీస్, సిద్ధు ఫ్రం శ్రీ‌కాకుళం లాంటి చిత్రాల్లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో గుర్తింపు ద‌క్కించుకుంది. చివరిగా ఖాకీ: ది బీహార్ చాప్టర్‌లో కనిపించింది. స్ర‌స్తుతం చాలా సినిమాలు సిరీస్ ల‌లో న‌టిస్తోంది. లేచింది మహిళా లోకం, అద‌రం, చాయ్ షాయ్ బిస్కెట్స్‌ సహా పలు చిత్రాలలో నటించనుంది. చాయ్ షాయ్ బిస్కెట్స్ గురించి చెప్పాలంటే ఈ చిత్రంలో షీబా చద్దా, శిశిర్ శర్మ, కెన్నెత్ దేశాయ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి కైజాద్ గెర్దా సంగీతం అందిస్తున్నారు. మిలింద్ షిర్కే సినిమాటోగ్రాఫ‌ర్. ఈ చిత్రాన్ని కరణ్ అరోరా నిర్మిస్తున్నారు.