బీచ్‌లో మద్యం సేవిస్తూ నటి!
హాట్ వెదర్ లో చిల్డ్ బీర్ సేవిస్తూ లేదా సాయంత్ర సమయంలో వోడ్కా సేవనంలో ఉన్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 29 Jun 2025 10:00 AM ISTఇటీవల సెలబ్రిటీలు మాల్దీవుల్లో విహారం నుంచి రకరకాల ఫోటోషూట్లు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ ఈ తరహా ఫోటోషూట్లతో పాపులరయ్యారు. కానీ ఇప్పుడు సౌత్ లో ఫేమస్ అయిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా వారి బాటలోనే వెళుతోంది. తాజాగా శ్రద్ధా తన ఇన్ స్టాలో కొన్ని హా* బికినీ ఫోటోలను షేర్ చేసింది. శ్రద్ధా బీచ్ రిసార్ట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోగ్రాఫ్స్ లో కొన్ని శ్రద్ధా ఆల్కహాల్ సేవిస్తున్న ఫోటోలు ఉన్నాయి. హాట్ వెదర్ లో చిల్డ్ బీర్ సేవిస్తూ లేదా సాయంత్ర సమయంలో వోడ్కా సేవనంలో ఉన్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
కొన్ని యువతరాన్ని టీజ్ చేసే హా* బికినీ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ ని చూడగానే జెర్సీలో చూసిన ట్రెడిషనల్ గాల్ ఈమేనా? అనే సందేహం కలుగుతోంది. గ్లామర్ హద్దులు చెరిపేయడమే గాక ఆల్కహాల్ సేవిస్తూ స్వేచ్ఛా జీవనానికి సంబంధించిన ఫోటోషూట్ తో ఆశ్చర్యపరిచింది. ఇక శ్రద్ధా ఈ ఫోటోగ్రాఫ్స్ లో ఎక్కడా మేకప్ అన్నదే లేకుండా చాలా సహజసిద్ధంగా కనిపించింది. బికినీ ధరించిన శ్రద్ధా శరీరంపై టాటూలు కూడా హైలైట్ అవుతున్నాయి.
దక్షిణాది అన్ని భాషల్లోను నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇటీవల కలియుగం 2064 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తో అభిమానుల ముందుకు వచ్చింది. విష్యత్తులో జరిగే మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో మానవ మనుగడ కోసం అప్పటి ప్రపంచం ఏం చేసిందనేదే ఈ సినిమా కథాంశం. సింప్లీ సౌత్ ఓటీటీలో విడుదలైంది. ప్రమోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు.
