'ఛావా' సంచలనంతో కపూర్ బ్యూటీ బయోపిక్!
స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సోలో నాయికగా శ్రద్దా కపూర్ ఇమేజ్ కూడా రెట్టింపు అయింది
By: Tupaki Desk | 15 Jun 2025 6:00 PM IST`స్త్రీ 2` సక్సెస్ తర్వాత శ్రద్దా కపూర్ ఇంతవరకూ మరో కొత్త చిత్రానికి కమిట్ కాలేదు. స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో సోలో నాయికగా శ్రద్దా కపూర్ ఇమేజ్ కూడా రెట్టింపు అయింది. పారితోషికం భారీగా పెంచినట్లు వార్తలొచ్చాయి. రెమ్యునరేషన్ కుదరక ఓ రెండు ప్రాజెక్ట్ లు కూడా వదులు కున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కొత్త సినిమాల కమిట్ మెంట్ విషయంలో ఆలస్య మవుతున్నట్లు కనిపించింది.
అయితే తాజాగా శ్రద్దా కపూర్ మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి కమిట్ అయింది. `ఛావా`తో సంచలనం సృష్టించిన లక్ష్మణ్ ఉట్టేకర్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో శ్రద్దా కపూర్ మరో ఆలోచన లేకుండా ఒప్పుకు న్నట్లు తెలుస్తోంది. జానపద ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన మహారాష్ట్ర గాయని, నృత్యకారిణి విఠాబాయి నారాయణ్ గావ్ కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ బయోపిక్ కేవలం ఓ నర్తకి గురించి మాత్రమే కాదు. పురుషాధిక్య ప్రపంచంలో సరిహద్దులను చెరిపేసి రాబోయే తరాలకు జానపద కళల గురించి తెలియజేసే గొప్ప మహిళ గురించి ఇందులో చెప్పబో తు న్నారు. ఈ కథ , పాత్ర తో పాటు దర్శకుడి ట్రాక్ రికార్డు చూసిన శ్రద్దా కపూర్ మరో ఆలోచన లేకుండా కమిట్ అయినట్లు తెలుస్తోంది. `ఛావా` విజయంతో లక్ష్మణ్ ఉట్టేకర్ పేరు దేశ వ్యాప్తంగా మారి మ్రోగిపోయింది.
ముఖ్యంగా ఇలాంటి కథలు తీయాలంటే ఆయనకే సాధ్యమంటూ హిందు వర్గం బలంగా విశ్వశిస్తుంది. ఇంతవరకూ వెండి తెరపై ఎన్నో రకాల బయోపిక్ లు చూసినా మరఠా యోధిడి బయోపిక్ మాత్రం సినిమా చరిత్రలో నిలిచిపోయేంత గొప్పగా తీయడంతోనే అంతటి ఖ్యాతికి కారకుడయ్యాడు.
