'సాహో' శ్రద్ధా నెమలి సొగసు
ఈ బ్యూటీ పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజీలపైనా నిరంతరం దర్శనమిస్తోంది. తాజాగా ప్రఖ్యాత ది పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై అందంగా ముస్తాబై కనిపించింది. శ్రద్ధా పూర్తిగా ట్రెడిషనల్ అవతార్ లో ఆకర్షించింది. ఒక
By: Tupaki Desk | 6 July 2025 4:00 PM ISTబాలీవుడ్ టు టాలీవుడ్ శ్రద్ధా కపూర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు ప్రభాస్ సరసన `సాహో` చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. శ్రద్ధా అందచందాలు, ప్రతిభకు అభిమానిగా మారిన ప్రభాస్ తన డ్రీమ్ గాళ్ కి పిలిచి మరీ అవకాశం కల్పించాడని కథనాలొచ్చాయి. అదంతా అటుంచితే, శ్రద్ధా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా సరికొత్త ఫోటోషూట్లతో హృదయాలను కొల్లగొడుతూనే ఉంది.
ఈ బ్యూటీ పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజీలపైనా నిరంతరం దర్శనమిస్తోంది. తాజాగా ప్రఖ్యాత ది పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై అందంగా ముస్తాబై కనిపించింది. శ్రద్ధా పూర్తిగా ట్రెడిషనల్ అవతార్ లో ఆకర్షించింది. ఒక అందమైన లెహంగా, దానికి కాంబినేషన్ ఆభరణాలతో ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది శ్రద్ధా. ముఖ్యంగా ఈ డిజైనర్ డ్రెస్ రూపకల్పన కోసం భారీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసారని కూడా అర్థమవుతోంది. పాల రాతి అందాలతో తాజ్ మహల్ లా మెరిసిపోతున్న భారీ భవంతిలో ఈ అందమైన ఫోటోషూట్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తాజా ఫోటోషూట్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. శ్రద్ధా కపూర్ ఈ గెటప్ లో నెమలిని తలపిస్తోందని అభిమానులు కీర్తిస్తున్నారు.
శ్రద్ధా ఇటీవల కెరీర్ ని మించి, వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ భామ ప్రముఖ రచయిత రాహుల్ మోదీతో డేటింగ్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ భామ హృతిక్ రోషన్ సరసన `క్రిష్ 4`లో నటించే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. కానీ దాని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
