సింపుల్ లుక్ తో కిల్ చేసిన శ్రద్ధా
ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 7 May 2025 11:00 AM ISTబికినీలు స్విమ్ సూట్లు అవసరమే లేదు. ప్రతిసారీ గ్లామర్ షోతో కుర్రకారును టీజ్ చేయాల్సిన పని లేదు. ఈ భామ అలా సింపుల్ గా రొటీన్ డ్రెస్ లో ఒక్క ఫోటోగ్రాఫ్ వదిలితే చాలు. దానికి కోట్లాదిగా ఉన్న ఫాలోవర్స్ గగ్గోలు పెడతారు. అలాంటి గొప్ప ఫ్యాషన్ సెన్స్ శ్రద్ధా కపూర్ కి ఉంది. ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
తాజాగా శ్రద్ధా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. దీనిలో మెరూన్ కలర్ టీషర్ట్ ధరించిన శ్రద్ధా షార్ట్ హెయిర్ స్టైల్ తో కొంత ట్రెండీగా కనిపిస్తోంది. కెరీర్ మ్యాటర్ కి వస్తే శ్రద్ధా నటించిన స్త్రీ 2 సంచలన విజయంస ఆధించాక, అందరి దృష్టి స్త్రీ 3 పై ఉంది.
తాజా ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ కథ, స్క్రిప్టు రెడీగా ఉంటే తాము కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ చిత్రం 2018 చిత్రం స్త్రీకి సీక్వెల్ . మాడాక్ ఫిల్మ్ హర్రర్-కామెడీ విశ్వంలో భాగం. ఇందులో రాజ్ కుమార్ రావు, శ్రద్ధ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. స్త్రీ 3లోను ఈ కాంబినేషన్ రిపీటవుతుంది.
