తనకంటే మూడేళ్లు చిన్నవాడితో డేటింగ్
ఈ బ్యూటీ ప్రముఖ రచయిత రాహుల్ మోడీతో నిండా ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 11 May 2025 4:37 AM'సాహో' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది శ్రద్ధా కపూర్. ఇటీవలే మడాక్ ఫిలింస్ లో స్త్రీ 2 లాంటి సంచలన హిట్ చిత్రంలో నటించింది. శ్రద్ధా తన కెరీర్ బెస్ట్ ఫేజ్‌ని ఆస్వాధిస్తోంది. క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో వరుస చిత్రాల్లో నటిస్తోంది. తదుపరి హృతిక్ రోషన్ సరసనా శ్రద్ధా ఓ చిత్రంలో నటించనుందని కథనాలొస్తున్నాయి.
మరోవైపు శ్రద్ధా వ్యక్తిగత జీవితం నిరంతరం చర్చగా మారుతోంది. ఈ బ్యూటీ ప్రముఖ రచయిత రాహుల్ మోడీతో నిండా ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రద్ధా అతడితో పదే పదే పబ్లిక్ ఔటింగులకు వెళుతూ మీడియా దృష్టిని నిరంతరం ఆకర్షించింది. ఈ జంట మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుటవుతోందని హిందీ మీడియా కథనాలు అల్లుతోంది. అయితే తమ మధ్య డేటింగ్ వార్తలను ఈ జంట ఇంకా అధికారికంగా కన్ఫామ్ చేయలేదు.
ఇంతలోనే ఈ జోడీ వయసు వ్యత్సాసం గురించి అభిమానుల్లో గుసగుసలు మొదలయ్యాయి. శ్రద్ధా తనకంటే మూడేళ్లు చిన్నవాడైన రచయితతో ప్రేమలో ఉందంటూ కథనాలొస్తున్నాయి. శ్రద్ధా కపూర్ - రాహుల్ మోడీ మధ్య 3 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. శ్రద్ధా బర్త్ డే - 3 మార్చి 1987. రాహుల్ మోడీ బర్త్ డే - 7 అక్టోబర్ 1990. ఆ ఇద్దరూ భారతదేశంలో జన్మించారు. శ్రద్ధా బాలీవుడ్ లో అగ్ర కథానాయిక. రాహుల్ మోడీ ఒక ప్రతిభావంతులైన రచయిత, సహాయ దర్శకుడిగా సుపరిచితుడు. ప్యార్ కా పంచ్‌నామా 2 (2015), సోను కే టిటు కి స్వీటీ (2018) , తు జీతూ మై మక్కర్ (2023) చిత్రాలతో బాలీవుడ్ లో పాపులరయ్యాడు. ఈ సినిమాల్లో కొన్నిటిలో శ్రద్ధా కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ జంట డేటింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.