తుంబాడ్ డైరెక్టర్ తో శ్రద్దా కపూర్..స్టోరీ ఏంటి ?
బాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు శ్రద్దా కపూర్ బ్రాండ్ అంబాసిడర్ గామారిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 April 2025 10:15 AM ISTబాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు శ్రద్దా కపూర్ బ్రాండ్ అంబాసిడర్ గామారిపోయిన సంగతి తెలిసిందే. `స్త్రీ `సక్సెస్ తో బాలీవుడ్ లో సోలో గానే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. `స్త్రీ 2` తో ఏకంగా 800 కోట్ల క్లబ్లో నే అడుగు పెట్టింది. ఓ మోస్తారు అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందని మేకర్స్ కూడా అంచనా వేయలేదు. అనూహ్య వసూళ్లతో శ్రద్దా కపూర్ స్టార్ డమ్ ఒక్కసారిగా రెట్టింపు అయింది.
ఈ విజయం తర్వాత పారితోషికం రెట్టింపు చేసింది. అలాగని హీరోయిన్ ఛాన్సులకు దూరం కాలేదు. వాటిలో అవకాశాలు అందుకుంటూనే సోలో నాయికగానూ సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలో శ్రద్దా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని లేడీ ఓ రియేంటెడ్ కథలు రాయడం ఎక్కువైంది అక్కడ రైటర్లలో. తాజాగా `తుంబాడ్` డైరెక్టర్ రాహు అనీల్ బార్వా శ్రద్దా కపూర్ తో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రం చేయడానికి సన్నా హాలు చేస్తున్నాడు.
ఇదొక హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. హాలీవుడ్ హారర్ స్టోరీల రేంజ్ లో ఉంటుందని ..ఇప్పటికే కథ విని శ్రద్దా కపూర్ ఒకే చేసినట్లు కూడా వినిపిస్తుంది. ఎక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందు కొచ్చింది. బడ్జెట్ కూడా భారీగానే కేటాయిస్తన్నారుట. శ్రద్దా కపూర్ కెరీర్ లోనే ఇదే హాయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారుట. శ్రద్దా కపూర్ పారితోషికంగానే కోట్లు చెల్లిస్తున్నారుట.
శ్రద్దా కపూర్ అందుకునే పారితోషికంతోనే రెండు సినిమాలు నిర్మించొచ్చు అని అంటున్నారు. అంటే ఈ లెక్కన ఏ రేంజ్ లో సినిమా నిర్మిస్తున్నారో అంచనా వేయోచ్చు. స్క్రిప్ట్ సహా ప్రీ ప్రొడక్షణ్ పనులన్ని ముగించి ఈ ఏడాది ద్వితియార్ధంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారుట. దీనికి సంబంధించి అధికారికంగా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
