Begin typing your search above and press return to search.

17 కోట్ల పారితోషికం లాభాల్లో వాటా కోరిన న‌టి

బాలీవుడ్‌లో భారీ పారితోషికం డిమాండ్ చేసే క‌థానాయిక‌ల్లో దీపిక‌, ఆలియా, క‌త్రిన వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు శ్ర‌ద్ధా క‌పూర్ కూడా ఈ జాబితాలో చేరింది.

By:  Tupaki Desk   |   4 May 2025 9:19 AM IST
17 కోట్ల పారితోషికం లాభాల్లో వాటా కోరిన న‌టి
X

బాలీవుడ్‌లో భారీ పారితోషికం డిమాండ్ చేసే క‌థానాయిక‌ల్లో దీపిక‌, ఆలియా, క‌త్రిన వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు శ్ర‌ద్ధా క‌పూర్ కూడా ఈ జాబితాలో చేరింది. సాహో బ్యూటీ శ్ర‌ద్ధా ఇటీవ‌ల స్త్రీ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 700కోట్లు వ‌సూలు చేసింది. శ్ర‌ద్ధా క‌పూర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న స్త్రీ 2 వ‌సూళ్ల‌కు కార‌ణ‌మ‌ని అభిమానులు న‌మ్ముతున్నారు.

ఇది నిజంగా శ్ర‌ద్ధాక‌పూర్ రేంజును అమాంతం స్కైలోకి చేర్చింద‌ని చెప్పాలి. ఏక్తా క‌పూర్ నిర్మించే త‌దుప‌రి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ న‌టించ‌నుంది. ఈ సినిమాకి సంత‌కం చేసేందుకు శ్ర‌ద్ధా భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. 17 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కావాల‌ని శ్ర‌ద్ధా త‌న నిర్మాత‌ను అడిగింద‌ని తెలిసింది. దీనికి ఓకే చెప్పిన‌ ఏక్తా క‌పూర్ ప్రాజెక్టును నిర‌భ్యంత‌రంగా ప్రారంభించారు. శ్ర‌ద్ధా క‌పూర్ కి పెరిగిన డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని ఏక్తా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ థ్రిల్లర్ శ్ర‌ద్ధా క‌పూర్- ఏక్తా క‌పూర్ ల‌కు ప్ర‌త్యేక‌మైన ప్రాజెక్ట్. ఈ సినిమాలో శ్ర‌ద్ధా పాత్ర యూనిక్ గా ఉంటుంద‌ని తెలిసింది. శ్రద్ధా కపూర్ త‌దుప‌రి `స్ట్రీ 3`లోను న‌టించ‌నుంది. హర్రర్-కామెడీ సీక్వెల్ 13 ఆగస్టు 2027న విడుదల కానుంది.