Begin typing your search above and press return to search.

వీడియో : గణేష్ నిమజ్జన వేడుకలో హీరోయిన్‌ మాస్ డాన్స్‌ వైరల్‌

గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   2 Sept 2025 4:10 PM IST
వీడియో : గణేష్ నిమజ్జన వేడుకలో హీరోయిన్‌ మాస్ డాన్స్‌ వైరల్‌
X

గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఐదో రోజున ఎక్కువగా నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. సోషల్‌ మీడియాలో నిమజ్జన వీడియోలు, గణేషుని ముందు భక్తులు ముఖ్యంగా సెలబ్రిటీలు వేసిన డాన్స్ లు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి చోట హీరో లేదా హీరోయిన్‌ డాన్స్ చేస్తే ఆ వీడియో ఎంత వైరల్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా సినిమాల్లో మాత్రమే కనిపించే నటి ఇలా రోడ్డు మీద వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక సాధారణ యువతి మాదిరిగా తీన్‌మార్‌ డాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చెప్పకనక్కర్లేదు. ఇప్పుడు శ్రద్దా దాస్‌ చేసిన తీన్మార్‌ డాన్స్ విషయంలో అదే చర్చ జరుగుతోంది. ఆమె చేసిన డాన్స్ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

శ్రద్దా దాస్ తీన్మార్‌ స్టెప్పులు

హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన శ్రద్దా దాస్‌ అన్ని భాషల్లోనూ గుర్తింపు దక్కించుకుంది. అయినా కూడా రోడ్డు మీద ఇలా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో డాన్స్ చేయడం అనేది ఖచ్చితంగా ఆమె ఘట్స్‌కి మెచ్చుకోవాల్సిందే. చిన్నపాటి సెలబ్రిటీలు కూడా బాబోయ్ రోడ్డు మీదకు వస్తే గుర్తు పట్టి ఇబ్బంది పెడుతారేమో అనుకుంటారు. కానీ శ్రద్దా దాస్ ఏకంగా రోడ్డుపై డాన్స్‌, అది కూడా తీన్మార్‌ డాన్స్ చేయడం, అంతే కాకుండా డ్రమ్స్ వాయించడం వంటివి చేసింది. ఆమె చేసిన ఈ పనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తూ ఉన్నారు. స్టార్‌ స్టేటస్‌, సెలబ్రిటీ హోద అనేవి ఏమీ లేకుండా చాలా చక్కగా ఆమె అందరితో కలిసి పోయింది అంటూ చాలా మంది చాలా రకాలుగా శ్రద్దను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వీడియోను మీరు ఒక లుక్కేయండి.

సోషల్‌ మీడియాలో శ్రద్దా దాస్ డాన్స్ వైరల్‌..

ఈ వీడియోలో శ్రద్దా సింపుల్‌ డ్రెస్‌లో, పెద్దగా మేకోవర్‌ లేకుండా, సింపుల్‌ హెయిర్‌ స్టైల్‌ తో కనిపించింది. ఇంత సింపుల్‌గా సెలబ్రిటీలు బయటకు వచ్చేందుకు అంగీకరించరు, కానీ శ్రద్దా దాస్‌ మాత్రం తన ఒరిజినల్‌ లుక్‌తోనే బయటకు వచ్చేసింది అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఆమెను ఇలా డాన్స్‌తో చూస్తే ప్రేక్షకులు వావ్‌ సూర్‌ అని అనుకుండా ఉండలేక పోతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఈ వీడియో కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా వందలాది మంది సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటూ తెగ లైక్ చేస్తున్నారు. గంటల్లో వైరల్‌ అయిన ఈ వీడియోతో అయినా శ్రద్దా దాస్ కి సినిమాల్లో ఆఫర్లు రావాలని ఆమె అభిమానులు ఈ సందర్భంగా కోరుకుంటున్నారు.

పారిజాత పర్వం సినిమాతో..

సినిమా ఇండస్ట్రీలో 2008లో అడుగు పెట్టిన శ్రద్దా దాస్‌ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. గత ఏడాది పారిజాత పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్‌ పడ్డా లేకున్నా, గుర్తింపు వచ్చినా రాకున్నా సినిమాలు చేయడం మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే 15 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రద్దా దాస్‌ మరో ఐదారు ఏళ్లు ఇండస్ట్రీలో ఈజీగా కొనసాగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాల్లో ఆఫర్లు తగ్గిన సమయంలో సోషల్‌ మీడియాలో షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలతో అయినా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తద్వారా మళ్లీ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసిన చీర కట్టు ఫోటోలు నెట్టింట పెద్ద ప్రకంపనలు సృష్టించిన విషయం తెల్సిందే. చీర కట్టులో శ్రద్దా అందరు హీరోయిన్స్ కంటే బాగుందని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు.