Begin typing your search above and press return to search.

ముందే టీజ‌ర్‌లో సీక్వెల్ షాట్స్‌..కానీ సినిమాలో..

టాలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర‌లో క్రేజీ సినిమాల‌కు సీక్వెల్స్ కూడా అదే స్థాయిలో తెర‌పైకొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 Feb 2026 12:00 AM IST
ముందే టీజ‌ర్‌లో సీక్వెల్ షాట్స్‌..కానీ సినిమాలో..
X

టాలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర‌లో క్రేజీ సినిమాల‌కు సీక్వెల్స్ కూడా అదే స్థాయిలో తెర‌పైకొస్తున్నాయి. ప్రేక్ష‌కులు కూడా ఈ త‌ర‌హా మూవీస్‌పై అమితాస‌క్తిని చూపిస్తుండ‌టంతో మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్స్‌, హీరోలు కూడా సీక్వెల్స్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. వాటికే ప్ర‌ధాన ప్రియారిటీ ఇస్తున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబడుతుండ‌టంతో ఇప్పుడు ఏ భాష‌లో చూసినా సీక్వెల్స్ గురించే చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్రేక్ష‌కులు క్రేజీ సీక్వెల్స్‌పై ఆస‌క్తిని చూపిస్తుండ‌టం, ఇవి బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని విధంగా వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపిస్తుండ‌టంతో డైరెక్ట‌ర్ ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయ‌డం కోసం స‌రికొత్త జిమ్మిక్కులు చేస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్‌కు రెడీ చేస్తూనే దానికి సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌కుండా ఆడియ‌న్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు. పార్ట్ 1కి సంబంధించిన సీన్స్‌ని చూపించ‌కుండానే పార్ట్ 2 సీన్స్‌తో టీజ‌ర్‌ల‌ని క‌ట్ చేస్తూ సీక్వెల్స్‌పై అంచ‌నాలు పెంచేస్తున్నారు.

ఈ ఫార్ములాకు ముందు శ్రీ‌కారం చుట్టిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా ఆయ‌న తెర‌కెక్కించి హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా `స‌లార్‌`. పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీకి సీక్వెల్‌గా `స‌లార్ 2`ని కూడా ప్లాన్ చేయ‌డం తెలిసిందే. అయితే సినిమాపై హైప్‌ని పెంచ‌డం కోసం `స‌లార్‌`కు సంబంధించిన టీజ‌ర్‌ని విడుద‌ల చేసి స‌రికొత్త స్ట్రాట‌జీకి తెరలేపిన విష‌యం తెలిసిందే. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ టీనూ ఆనంద్ `సింపుల్ ఇంగ్లీష్‌..ల‌య‌న్‌, చీతా, టైగ‌ర్‌, ఎలిఫెంట్‌..వెరీ డేంజ‌ర‌స్‌...బ‌ట్..నాట్ ఇన్ జురాసిక్ పార్క్‌. బికాజ్ ఇన్ ద‌ట్ పార్క్ దేర్ ఈజ్ ఏ.. అంటూ పార్ట్ 2కి సంబంధించిన సీన్‌ని చూపించి సినిమాపై హైప్ పెంచేశాడు.

`స‌లార్‌`లో ఈ సీన్ లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ చాలా వ‌ర‌కు నిరుత్సాహానికి గుర‌య్యారు. ఇదే ఫార్ములాని డైరెక్ట‌ర్ సుకుమార్ `పుష్ప‌` కోసం ఫాలో అయ్యాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్క‌ల మాస్టారు తెర‌కెక్కించిన పాన్ ఇండియా వండ‌ర్ `పుష్ప‌`. దీనికి సీక్వెల్‌గా `పుష్ప 2`ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే సినిమాపై హైప్‌ని పెంచ‌డం కోసం డైరెక్ట‌ర్ సుకుమాక్ పార్ట్ 3 `పుష్ప :ది ర్యాంపేజ్‌`కు సంబంధించిన టీజ‌ర్‌ని విడుద‌ల చేసిన హైప్ క్రియేట్ చేశాడు. బ‌న్నీ ముసుగు ధ‌రించి పోలీసులుకు దొర‌క్కుండా త‌ప్పిచుకుని తిరుగుతూ క‌నిపించ‌డం, ఈ వార్త‌లు జోరుగా టీవీల్లో ప్ర‌సారం చేయ‌డం..అది చూసి జ‌నం `పుష్ప‌` కోసం మ‌ద‌న‌ప‌డ‌టం..

అడ‌విలో చిరుత‌కు ఎదురుప‌డ‌టం, బ‌న్నీ కోసం ఊరూరా పోలీసులు గాలిస్తున్న‌ట్టుగా చూపించ‌డం తెలిసిందే. ఈ సీన్‌లేవీ `పుష్ప‌2`లో లేవు. `పుష్ప 3`కి సంబంధించిన సీన్‌లు అని `పుష్ప 2` రిలీజ్ త‌రువాత అంద‌రికి క్లారిటీ వ‌చ్చింది. ఇప్పుడు ఇదే స్ట్రాట‌జీని బాలీవుడ్ మూవీ `ధురంధ‌ర్‌` కోసం ఉప‌యోగించాడు డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్‌. పార్ట్ 1 రిలీజ్ టైమ్‌లో రిలీజ్ చేసిన టీజ‌ర్‌లో `ధురంధ‌ర్ 2:ది రివేంజ్‌`కి సంబంధించిన హార్డ్ కోర్ యాక్ష‌న్ సీన్స్‌ని చూపించ‌డంతో సినిమాపై స‌హ‌జంగానే హైప్ క్రియేట్ అయింది. అయితే పార్ట్ 1లో టీజ‌ర్లో చూపించిన సన్నివేశాల్లో చాలా వ‌ర‌కు క‌నిపించ‌క‌పోవ‌డంతో పార్ట్ 2లో వీటిని చూపిస్తార‌ని తేల‌డంతో ఇప్పుడు అంతా `ధురంధ‌ర్ 2:ది రివేంజ్‌` కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా సీక్వెల్స్‌పై క్రేజ్‌ని క్రియేట్ చేయ‌డం కోసం డైరెక్ట‌ర్స్ ఎంచుకున్న కొత్త ఫార్ములా మంచి ఫ‌లితాల‌ని అందిస్తుండ‌టంతో రానున్న రోజుల్లో మ‌రి కొంత మంది ద‌ర్శ‌కులు సీక్వెల్స్ కోసం ఇదే ఫార్ములాని ఫాలో కావ‌డం ఖాయం.