ఎన్టీఆర్ కథ నాని వద్దకు వెళ్లిందా?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ గురించి అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 20 Jun 2025 8:15 AM ISTటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ గురించి అందరికీ తెలిసిందే. మంచి ఎమోషనల్ చిత్రంగా వచ్చిన ఆ సినిమా.. నాని కెరీర్ లో ఒక క్లాసిక్ మూవీగా నిలిచింది. ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఆ సినిమాతోనే సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన శౌర్యువ్.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.
అయితే హాయ్ నాన్న వచ్చి ఏడాదిన్నర అవుతుంది. కానీ ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు శౌర్యువ్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీసే ఛాన్స్ అందుకున్నారని ఆ మధ్య సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. శౌర్యువ్ స్టోరీ లైన్ కు తారక్ ఫిదా అయ్యారని టాక్ వినిపించింది. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.
తన లైనప్ లో వరుస సినిమాలు ఉండటంతో.. ఎన్టీఆర్ డ్రాప్ అయ్యారని తెలుస్తోంది. అదే సమయంలో తన డెబ్యూ హీరోతోనే రెండో మూవీని కూడా శౌర్యువ్ తీయనున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన శౌర్యువ్ కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేయమని కూడా చెప్పేశారట.
అయితే తారక్ కోసం అనుకున్న స్క్రిప్టా లేక కొత్తదా అనేది తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే సుజీత్ సినిమా పూర్తి చేసిన తర్వాత శౌర్యువ్ మూవీని నాని స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు ఆయన శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ప్యారడైజ్ మూవీపై కంప్లీట్ ఫోకస్ పెట్టారు.
ఇప్పుడు బ్రేక్ లో ఉన్నా.. కొద్ది రోజుల తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత ఓజీ వర్క్స్ తో సుజీత్ ఫ్రీ అవ్వనుండగా.. ఆయన సినిమాను కంప్లీట్ చేయనున్నారు. అనంతరం శౌర్యువ్ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో శౌర్యువ్ స్టోరీ రాసుకున్నారని, కొత్త జోనర్ లో మూవీ ఉండనుందని టాక్.
అయితే ఆ సినిమాను నాని మేనేజర్ ఎస్ వెంకట్ రత్నం రూపొందించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ మూవీతో నిర్మాతగా అరంగేట్రం చేయబోతున్నారని సమాచారం. చాలా కాలం క్రితం నాని తన మేనేజర్ వెంకట్ కు ఒక సినిమా చేస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు అది కార్యరూపం దాల్చనుందట. ఓ టాప్ ప్రొడ్యూసర్ సహ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారని వినికిడి.
