Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం సృష్టించిన షార్ట్ ఫిల్మ్స్!

అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ల‌ఘు చిత్రాల పోటీత‌త్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్ని వంద‌లు..వేల చిత్రాల్ని వెన‌క్కి నెట్టి పోటీల్లో నెగ్గ‌డం అంటే ఆషామాషీ కాదు

By:  Tupaki Desk   |   18 Nov 2023 7:46 AM GMT
సంచ‌ల‌నం సృష్టించిన షార్ట్ ఫిల్మ్స్!
X

అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ల‌ఘు చిత్రాల పోటీత‌త్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కొన్ని వంద‌లు..వేల చిత్రాల్ని వెన‌క్కి నెట్టి పోటీల్లో నెగ్గ‌డం అంటే ఆషామాషీ కాదు. అది ఒక‌టి రెండు..కాదు 50కి పైగా అవార్డులు కొల్ల‌గొట్ట‌డం అంటే చిన్న విష‌యం కాదు. తాజాగా 'ష‌ష్టి'..'స‌ర‌స్' ల‌ఘు చిత్రాలు అంతార్జాతీయ అవార్డుల తో పంట పండించాయి. 'ప‌ష్టి' 2022 లో 35వ అంత‌ర్జాతీయ చిత్రోత్స‌వాల్లో ఏకంగా 75 అవార్డులు గెలుచుకుంది.

అలాగే 'స‌ర‌స్' అనే ల‌ఘు చిత్రం 2023 ..20 అంత‌ర్జాతీయ చిత్రోత్స‌వాల్లో 70కి పైగా అవార్డుల‌ను గెలుచుకుంది. మ‌రి ఈ సినిమాలు డైరెక్ట్ చేసింది. ఎవ‌రో తెలుసా? అత‌నో చార్టెడ్ అకౌంటెంట్. అత‌ని పేరు పీట‌ర్ డెమియ‌న్. 30 ఏళ్ల‌గా ఆ రంగంలో విశేష సేవ‌లందించిన పీట‌ర్ సినిమా రంగంపై ఆస‌క్తితో అక్క‌డ నుంచి కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. తొలి ప్ర‌య‌త్నం ష‌ష్టి తెర‌కెక్కించారు.

ఈ లఘ చిత్రం వివిధ చిత్రోత్సావాల్లో ప్ర‌ద‌ర్శిత‌మై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ సినిమా అవార్డులు గెలుచుకోవ‌డంతో? అదే ఉత్సాహంతో 'స‌ర‌స్' ని కూడా తెర‌కెక్కించారు. ఈ రెండు అవార్డులు సాధించ‌డంతో పీట‌ర్ కి మంచి గుర్తింపు ద‌క్కింది. సొంత ఆలోచ‌న‌లు..అనుభ‌వాలు..క‌ళాత్మ‌క ప‌రిజ్ఞానంతో చిత్రాలను ప్రేక్ష‌కుల‌కు అందించాలి అన్న ఆశ‌తోనే ఈ రంగంలోకి వ‌చ్చిన‌ట్లు పీట‌ర్ తెలిపారు.

ప్ర‌స్తుతం ఆ చిత్రాలు కొన్ని ఓటీటీ ప్లాట్ పామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఐడెంటిటీ కొత్త అవ‌కాశాల‌కు దారులు వేస్తున్నాయి. రెండు ల‌ఘు చిత్రాలు మ‌రిన్ని ల‌ఘుచిత్రాల‌కు దారి తీస్తున్నాయి. ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ల‌ఘు చిత్రాల పోటీ న‌డుస్తుంది. అలాగే చిల్డ్ర‌న్స్ ఫిలిం పెస్టివ‌ల్స్ గ్రాండ్ గా జ‌రుగుతుంటాయి. మిగ‌తా వేదిక‌ల‌పైనా ఈ రెండు చిత్రాలు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.