'షోలే' మూవీకి అత్యధిక పారితోషికం ఎవరిదో తెలుసా?
బాలీవుడ్ బిగ్‌బి సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రల కాంఇబనేషన్‌లో రూపొందిన సంచలన మల్టీస్టారర్ `షోలే`.
By: Tupaki Desk | 25 Jun 2025 3:00 PM ISTబాలీవుడ్ బిగ్‌బి సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రల కాంఇబనేషన్‌లో రూపొందిన సంచలన మల్టీస్టారర్ `షోలే`. ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నో రికార్డుల్ని తిరగరాసిన ఈ సినిమా తరువాత ఆ స్థాయి మల్టీస్టార్ మూవీ ఇంత వరకు రాలేదు. జీపి సిప్పి నిర్మించగా ఆయన తనయుడు రమేష్ సిప్పి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆగస్టు 15, 1975లో విడుదలైన ఈ సినిమాలో హేమా హేమీలు జయా బచ్చన్, హేమామాలిని, అమ్జాద్ ఖాన్, సంజీవ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
ఇందులో ధర్మేంద్ర మెయిన్ హీరో. అమితాబ్ బచ్చన్ సెకండ్ లీడ్. కానీ సినిమా రిలీజ్ తరువాత మాత్రం ఎక్కువ క్రేజ్ అమితాబ్ బచ్చన్‌కు దక్కింది. ఆర్‌డీ బర్మన్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికీ ఇండియన్ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ దీనిపై ఎక్కడో ఒక దగ్గర చర్చ జరుగుతూనే ఉంది. అంతా ఈ సినిమా భారతీయ సినీ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆడుతూ ఇప్పటి వరకు 25 కోట్ల టికెట్‌లు తెగిన ఏకైక సినిమాగా రికార్డు సాధించింది.
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఈ సినిమా మరో సారి 4కెలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 27 రిలీజ్ కాబోతోంది. ఇదే రోజు ఇటలీలోని బొలోగ్నాలోని ద ఫేమస్ సినిమా రెట్రోవెటో ఫెస్టివెల్‌లో దీన్ని ప్రదర్శించబోతున్నారు. అంతే కాకుండా అన్ కట్ వెర్షన్‌ని ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిసింది. ఇక ఈ సినిమాకు ఆర్టిస్ట్‌లు అందుకున్న పారితోషికాల వివరాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. అయితే ఇందులో ధర్మేంద్రదే అత్యధిక పారితోషికం కావడం విశేషం.
షోలో మొత్తం బడ్జెట్ రూ.3 కోట్లు. ధర్మేంద్ర పారితోషికం రూ.1.50 వేలు. సంజీవ్ కుమార్ రూ.1.25 వేలు, అమితాబ్ బచ్చన్‌కు ఇచ్చింది కేవలం లక్ష మాత్రమే. ఇక హేమా మాలినికి రూ.75,00 వేలు, అమ్జాద్ ఖాన్‌కు రూ.50,00 వేలు, జయా బచ్చన్‌కు రూ.35,000 మాత్రమే.
