'షోలే' ఇప్పుడు తీసి ఉంటే బడ్జెట్ ఎంతయ్యేదో తెలుసా?
ఇందులో నటించిన నటీనటులు రెమ్యూనరేషన్‌లు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 26 Jun 2025 12:00 AM ISTధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ `షోలే`. 1975లో విడుదలైన ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి లమితాబ్‌ని స్టార్‌ని చేసింది. ఈ మూవీ విడుదలై ఇప్పటికి 50 ఏళ్లు కావస్తున్నాయి. అయినా సరే ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. దర్శకులు, హీరోలు, నిర్మాతలు ఈ సినిమాని రిఫరెన్స్‌గా తీసుకుని ఆ స్థాయి భారీ మల్టీస్టారర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇందులో నటించిన నటీనటులు రెమ్యూనరేషన్‌లు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి. అప్పట్లోనే రూ.3బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. చాలా వరకు హిట్ సినిమాలని 4కెలోకి మార్చి రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీని కూడా 4కెలోకి మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జూన్ 27 నుంచి `షోలే` 4కె ప్రింట్ అందుబాటులోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
అప్పట్లో హేమా హేమీలాంటి ఆర్టిస్ట్‌లతో రూ.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్‌ని ఇప్పుడు నిర్మించిఉంటే ఎంత ఖర్చు అయ్యుండేది. ఏ ఏ విభాగాలకు ఎంతెంత ఖర్చు చేయాల్సి వచ్చేది అనే ఆసక్తికరమైన ఫిగర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేటి మేకింగ్ విధానాన్ని బట్టి ఈ రోజుల్లో గనక `షోలే`ని నిర్మిస్తే అయ్యే బడ్జెట్ రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల పైమాటే.
ఇందులో ఆర్టిస్ట్‌లకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. ఇక వీఎఫ్ ఎక్స్ అండ్ సీజీ వర్క్ కోసం రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు అవుతుందని ఓ అంచనా. అంతే కాకుండా షూటింగ్ లొకేషన్‌ల కోసం.. సెట్‌ల కోసం రూ.25 కోట్లు అవుతుందట. మ్యూజిక్‌తో పాటు సినిమా మార్కెటింగ్‌కు రూ.30 నుంచి రూ. 40 కోట్లకు పైనే అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే అప్పటి ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు షోలే రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లు కొల్లగొట్టేదన్నమాట.
