Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఈ తెలుగమ్మాయి షో ముందు వాళ్లు కూడా దిగదుడుపే

సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో పెద్దగా స్కోప్ ఉండటం లేదు

By:  Tupaki Desk   |   31 July 2023 6:38 AM GMT
పిక్ టాక్ : ఈ తెలుగమ్మాయి షో ముందు వాళ్లు కూడా దిగదుడుపే
X

తెనాలికి చెందిన తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల 2013 సంవత్సరంలో మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. అదే ఏడాది జరిగిన మిస్‌ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొనడం జరిగింది. మొత్తానికి మోడల్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.


సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో పెద్దగా స్కోప్ ఉండటం లేదు. అందుకే ఈమె డైరెక్ట్‌ గా ముంబయి వెళ్లి అక్కడ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసింది. ఆమె ప్లాన్ వర్కౌట్ అయింది. బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో సౌత్‌ లో కూడా ఈమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు లో కూడా ఈ అమ్మడు ముందు ముందు స్టార్స్ కి జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి.

తాజాగా ఈ అమ్మడు సిల్వర్‌ లెహంగాలో మెరిసి కన్నుల విందు చేసింది. సాధ్యం అయినంతగా నడుము అందాన్ని చూపిస్తూ నాభి అందం తో ఉక్కిరి బిక్కిరి చేస్తూ క్లీవేజ్ అందాలతో మతి పోగొట్టినంత పని చేస్తుంది. ఈ రేంజ్ అందాల ఆరబోత బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్‌ కి కూడా సాధ్యం కాదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత అందంగా ఉన్న శోభితా ధూళిపాళ్ల అందాల ఆరబోత స్కిల్స్ ముందు బాలీవుడ్ లో హాట్ బ్యూటీస్ గా చెప్పుకునే వారికి కూడా సాధ్యం కాకపోవచ్చు.. వారంతా కూడా శోభితా ముందు దిగదుడుపే అన్నట్లుగా కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు అక్కినేని హీరోతో ప్రేమలో ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. ఇంకా కూడా ఆ వార్తలకు క్లారిటీ రాలేదు. ఇద్దరు కలిసి విదేశాల్లో తిరుగుతూ.. పార్టీలకు హాజరు అవుతున్న కారణంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.