Begin typing your search above and press return to search.

అఖిల్‌ రిసెప్షన్‌లో అందరి దృష్టి శోభిత...!

పెళ్లిలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన శోభిత రిసెప్షన్‌లోనూ మోడ్రన్‌ లుక్‌లో కనిపించింది. రెడ్‌ ఔట్‌ ఫిట్‌ ధరించిన శోభిత తన చేతిలో అత్యంత ఖరీదైన బ్యాన్‌ను సైతం కలిగి ఉంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 5:15 PM IST
అఖిల్‌ రిసెప్షన్‌లో అందరి దృష్టి శోభిత...!
X

అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అఖిల్‌ వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత అదే స్థాయిలో వివాహ రిసెప్షన్‌ సైతం జరిగింది. ప్రముఖులు, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్యాన్స్ పాల్గొన్న అఖిల్‌, జైనాబ్‌ వివాహ రిసెప్షన్‌లో నాగ చైతన్య, శోభితల జోడీ అందరి దృష్టిని ఆకర్షించింది. నాగ చైతన్య, శోభిత దూళిపాళ పెళ్లి తర్వాత ఇలా ఒక వేడుకలో జంటగా పాల్గొనడం ఇదే కావడంతో మీడియా వారి దృష్టిని సైతం ఆకర్షించారు. పెళ్లి తంతు, రిసెప్షన్‌లో అఖిల్‌, జైనాబ్‌ల తర్వాత ఎక్కువగా నాగ చైతన్య, శోభితల గురించి చర్చ జరిగిందని కూడా చాలా మంది చెప్పుకొచ్చారు. సోషల్‌ మీడియాలో నాగ చైతన్య, శోభితల జోడీ ఫోటోలు ప్రముఖంగా వైరల్‌ అయ్యాయి.

పెళ్లిలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన శోభిత రిసెప్షన్‌లోనూ మోడ్రన్‌ లుక్‌లో కనిపించింది. రెడ్‌ ఔట్‌ ఫిట్‌ ధరించిన శోభిత తన చేతిలో అత్యంత ఖరీదైన బ్యాన్‌ను సైతం కలిగి ఉంది. ఆ బ్యాగ్‌ ఖరీదు దాదాపుగా రూ.3.37 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో చాలా మంది శోభిత లుక్ గురించి, ఆమె చేతిలో ఉన్న బ్యాగ్‌ గురించి, ఆమె ధరించిన బ్లౌజ్ డిజైన్ గురించి ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. పెళ్లి కూతురు ధరించిన డ్రెస్ కంటే కూడా శోభిత ధరించిన ఔట్‌ ఫిట్‌ ఫ్యాషన్ ప్రేమికుల మనసు దోచినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి శోభిత మరోసారి తన స్టైలిష్ ఔట్‌ ఫిట్‌తో వార్తల్లో నిలిచింది.

అక్కినేని వారి ఇంటి కోడలుగా శోభితపై చాలా బాధ్యత ఉంటుంది. ఆమె ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే శోభిత తన పబ్లిక్‌ అప్పియరెన్స్‌ సమయంలో చాలా హుందాగా, పద్ధతిగా ఉంటుంది. అదే సమయంలో ఆమె స్టైల్‌ ఐకాన్ మాదిరిగా కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ఫ్యాషన్‌ ప్రియులు అంటూ ఉంటారు. ఇలా సాంప్రదాయ బద్దంగా ఉంటూనే ఫ్యాషన్‌ గా కనిపించడం శోభితకు మాత్రమే సాధ్యమేమో అంటూ చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. నాగ చైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత శోభిత సోషల్‌ మీడియాలో కాస్త తక్కువగా కనిపిస్తుంది అనే వారు ఉన్నారు.

పెళ్లికి ముందు వరుసగా సినిమాలు, సిరీస్‌లు చేసిన శోభిత ఈ మధ్య స్లో అయింది. పెళ్లి హడావుడి కారణంగా ఆ మధ్య రెండు మూడు నెలలు పూర్తిగా షూటింగ్స్‌కి బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఎప్పటిలాగే షూటింగ్స్‌ కు హాజరు అవుతుంది. కానీ ఈమె నటించిన సినిమాలు, సిరీస్‌లు ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి మాత్రం కనపడటం లేదు. త్వరలోనే నాగ చైతన్య, శోభిత కలిసి నటించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. గతంలో నాగ చైతన్య, సమంత విడిపోక ముందు కలిసి నటించారు. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కనుక భార్య భర్తలు అయిన నాగ చైతన్య, శోభిత కలిసి నటిస్తే కచ్చితంగా అన్ని విధాలుగా బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.