Begin typing your search above and press return to search.

'శ్యాంబాబు' ఎఫెక్ట్...'శోభన్ బాబు'ని పట్టిన ఫృధ్వీ!

"శోభన్ బాబు" పేరుతో రాబోతున్న కొత్త సినిమాలో "శ్యాంబాబు"పాత్ర ఏకంగా రెండు గంటలు ఉంటుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 5:06 AM GMT
శ్యాంబాబు  ఎఫెక్ట్...శోభన్  బాబుని పట్టిన  ఫృధ్వీ!
X

సినిమాల పరంగా గతకొంతకాలంగా పెద్దగా ఫృధ్వీ పేరు వినిపించడం లేదనేది ఆయన అభిమానుల మాటగా ఉంది. ఈ సమయంలో సరైన టైలో సరైన బ్రేక్ అన్నట్లుగా "బ్రో" సినిమా పడింది. ఫలితంగా సినిమా కంటే ఎక్కువగా శ్యాంబాబు పాత్ర మీడియాలో వైరల్ గా మారిందన్నా అతిశయోక్తి కాదన్నట్లుగా వ్యవహారం నడించింది.

ఈ సమయంలో "శ్యాంబాబు" పాత్రకు కంటిన్యూషన్ లో భాగంగా ఫుల్ లెంగ్త్ రోలో.. లేక, టైటిల్ రోల్ పోషించే సరికొత్త పాత్రో తెలియదు కానీ... పృథ్వీ రాజ్ కు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఇందులో భాగంగా.. "శోభన్ బాబు" పేరుతో రాబోతున్న కొత్త సినిమాలో "శ్యాంబాబు"పాత్ర ఏకంగా రెండు గంటలు ఉంటుందని చెబుతున్నారు.

దీనికి సంబంధించి పృథ్వీ రాజ్ కీలక అంశాలను వెల్లడించారు. "బ్రో" సినిమాలో "శ్యాంబాబు" పాత్ర 1 నిమిషం 5 సెకన్లు ఉంటే, కొత్తగా చేయబోయే "శోభన్ బాబు" సినిమాలో రెండు గంటలు ఉంటుందని వెల్లడించారు. ఆ సినిమాకు సంబంధించి తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు ఫృధ్వీ!

అవును... తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రచయిత, దర్శకుడు తనకొక బంపరాఫర్ ఇచ్చారని.. బ్రో సినిమాలో శ్యాంబాబు వన్ మినిట్ ఫైవ్ సెకన్స్ ఉంటే.. ఆయన చేయబోయే సినిమా శోభన్ బాబులో శ్యాంబాబు రెండు గంటలు ఉంటాడని తెలిపారు.

ఇదే సమయంలో ఇది తనకు ఒక అద్భుతమైన అవకాశం అని.. ఇక, ఆ సినిమాకు సంబంధించిన రచయిత, బ్యానర్, అన్ని విషయాలు త్వరలోనే తెలియచేస్తానని ఫృధ్వీ తెలిపారు. ఈ సందర్భంగా తన కెరీర్ ని మలుపుతిప్పే సినిమా శోభన్ బాబు అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం... ఈ శ్యాంబాబు ని మరలా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.