Begin typing your search above and press return to search.

శోభ‌న్ బాబు మ‌న‌వ‌డు చెప్పిన‌ షాకింగ్ నిజం!

అస‌లు త‌న మ‌న‌వ‌డు డాక్ట‌ర్ సుర‌క్షిత్‌కి తాత శోభ‌న్ బాబు అంత పెద్ద స్టార్ అని కూడా తెలియ‌ద‌ట‌. ఈ విష‌యాన్ని సుర‌క్షిత్ స్వ‌యంగా చెప్పారు.

By:  Tupaki Desk   |   19 May 2025 10:37 AM IST
శోభ‌న్ బాబు మ‌న‌వ‌డు చెప్పిన‌ షాకింగ్ నిజం!
X

తండ్రి రాజకీయ నాయకుడు అయినా, హీరో అయినా, ముఖ్య‌మంత్రి అయిన సరే.... ఆ తండ్రి తన కుటుంబాన్ని ఎలా ఉంచాలి అనుకుంటాడో అలాగే ఉంచుతాడు... తన ప్రొఫెషన్ కి దగ్గరగా లేదా దూరంగా... టాలీవుడ్ లో ఈ స్టార్ హీరో కూడా అంతే. త‌న కొడుకులు మ‌న‌వ‌లు మ‌న‌వ‌రాళ్ల‌ను కూడా గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంచారు.

అంద‌గాడు, సోగ్గాడు శోభన్ బాబు త‌న కుటుంబాన్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచడానికి ఎక్కువ ఇష్టపడ్డారు.గ్లామ‌ర్ ప్ర‌పంచం కంటే, తన కుటుంబం ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి అన్నది ఆయన సంకల్పించారు. నిజం చెప్పాలంటే త‌న కొడుకులు మ‌న‌వ‌ళ్ల‌ను కూడా శోభ‌న్ బాబు సినీపరిశ్ర‌మ వైపు చూడ‌నివ్వ‌లేదు. అస‌లు త‌న మ‌న‌వ‌డు డాక్ట‌ర్ సుర‌క్షిత్‌కి తాత శోభ‌న్ బాబు అంత పెద్ద స్టార్ అని కూడా తెలియ‌ద‌ట‌. ఈ విష‌యాన్ని సుర‌క్షిత్ స్వ‌యంగా చెప్పారు.

నిజానికి మంచి చ‌దువుల కోసం సుర‌క్షిత్ ని ఈ గ్లామ్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచానికి శోభ‌న్ బాబు దూరంగా ఉంచ‌ర‌ని అర్థం చేసుకోవాలి. దానివల్ల తాత గారికి ఎంత పేరుంది అన్నది అతడికి తెలిసి ఉండకపోవచ్చు... ఇప్పటివరకు అతను కూడా పెద్ద డాక్టర్ అని మనకి కూడా తెలియదు క‌దా! ... సమయం వస్తేనే ఎవరు ఏమిటి అన్నది తెలుస్తుంది అతడికైన మనకైనా!

నిజానికి సుర‌క్షిత్ త‌న‌కు తాత ఎంత పెద్ద స్టార్ అనేది తెల‌య‌దు అనగానే, అత‌డిని విమర్శించడానికి నెటిజ‌నులు రెడీ అయిపోయారు. అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు.... చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత వాళ్ళ సినిమాలు వారి పిల్లలకు కూడా చూపించరు.. దానికి కారణాలు అనేకం ఉంటాయి. పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు? అన్నది కూడా ఆలోచిస్తారు. అలాగే శోభన్ బాబు ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల రీత్యా కుటుంబాన్ని దూరంగా పెట్టి ఉంటారు. ఇందులో గొప్ప విషయం ఏమిటి అంటే తండ్రి చెప్పినట్లుగానే వాళ్ళు దూరంగా ఉండి చదువు వైపు అడుగులు వేశారు తప్ప తండ్రి లేదా తాత పేరుతో వాళ్లు కూడా యాక్టర్స్ అవ్వాలి అని ముందుకు రాలేదు. తాత మాట‌ను సుర‌క్షిత్ గౌర‌వించి దూరంగా ఉన్నారు... తండ్రి పేరుతోనో తాత పేరుతోనో బయటికి రాకుండా వాళ్లు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి పేరుతో ముందుకొచ్చి ఆనక తాతగారి మనవడు అన్న పేరుని చెప్పుకుంటున్నాడు ఇందులో తప్పేముంది..? ఇదే కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే..! ఇదే కదా ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎదగడం అంటే... దీని అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్లు కామెంట్స్ పెడుతున్న వాళ్లని చూస్తుంటే ఎంత అజ్ఞానంలో కొట్టుమిట్టలాడుతున్నారు వీళ్లంతా అనిపిస్తుంది. ఏది ఏమైనా సోగ్గాడు శోభ‌న్ బాబు మ‌న‌వ‌డు రంగుల ప‌రిశ్ర‌మ‌కు రాకుండా దూరంగా ఉండటం త‌ప్పేమీ కాదు. అత‌డు డాక్ట‌ర్ గా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని కోరుకుందాం. పైగా డాక్ట‌ర్ గా సుర‌క్షిత్ చేస్తున్న ప్ర‌యోగాలకు కూడా చాలా గుర్తింపు వ‌స్తోంది. గొప్ప డాక్టర్ అత‌డు చాలా ఆపరేషన్స్ చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు... ఇలాంటి గొప్ప‌ వాతావరణంలో పెంచారు శోభన్ బాబు త‌న వార‌సుల్ని. కుమారులు ఇది కదా కావలసింది.