Begin typing your search above and press return to search.

చీర కట్టులో టాలీవుడ్‌ స్టార్‌ కిడ్ కన్నుల విందు!

పింక్ కలర్ చీరలో తెల్లని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి చాలా సింపుల్‌ అండ్‌ కూల్‌ లుక్ లో సందడి చేసింది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 8:41 AM GMT
చీర కట్టులో టాలీవుడ్‌ స్టార్‌ కిడ్ కన్నుల విందు!
X

బాలీవుడ్‌ లో హీరోయిన్స్ గా ప్రస్తుతం ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. కానీ సౌత్ లో మాత్రం స్టార్‌ కిడ్స్ కి హీరోయిన్‌ గా ఛాన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. హీరోయిన్‌ గా రాణించాలని కొందరు హీరోల లేదా హీరోయిన్స్‌ కూతుర్లు ప్రయత్నాలు చేస్తున్నా కూడా బొక్క బోర్లా పడుతున్నారు.


తెలుగు అమ్మాయిలకు హీరోయిన్స్‌ గా ఛాన్స్ లు రావని తెలిసి కూడా ప్రయత్నం చేసే వారు చాలా మంది ఉన్నారు. సీనియర్ స్టార్‌ హీరో రాజశేఖర్‌, జీవిత దంపతుల ఇద్దరు కుమార్తెలు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇద్దరికి కూడా సరైన సక్సెస్ లు దక్కడం లేదు. నటిగా నిరూపించుకునేందుకు కూడా మంచి అవకాశాలు దక్కడం లేదు.


అందం విషయంలో ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నా కూడా ఆఫర్లు రావడం లేదు. ఈ మధ్య కాలంలో ఈ స్టార్ కిడ్స్ స్కిన్‌ షో వైపు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. చాలా అందంగా ఉండే శివాత్మిక రెగ్యులర్ గా హద్దులు దాటకుండా స్కిన్‌ షో చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి చీర కట్టులో కన్నుల విందు చేసింది.

సోషల్ మీడియాలో శివాత్మిక రాజశేఖర్‌ షేర్‌ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పింక్ కలర్ చీరలో తెల్లని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి చాలా సింపుల్‌ అండ్‌ కూల్‌ లుక్ లో సందడి చేసింది. నడుము అందం చూపించి చూపించకుండా చూపిస్తూనే, క్లీ వేజ్ షో తో కూడా మెప్పించిన శివాత్మిక ఫోటోలు చూసి చాలా మంది ఎందుకు ఆఫర్లు రావడం లేదని ఫీల్ అవుతూ ఉంటారు.

శివాత్మికతో పోల్చితే ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో చాలా మంది తక్కువ అందంగానే ఉంటారు. అయినా కూడా శివాత్మిక కంటే వారికే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. శివాత్మిక కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఔట్‌ ఫిట్‌ లో సందడి చేసినట్లుగా సోషల్‌ మీడియా ద్వారా తెలుస్తోంది. ఆమె కొత్త సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.