Begin typing your search above and press return to search.

శివాత్మిక నేచురల్ గానే.. హీటెక్కిస్తోందిగా..

ముఖంపై ఎలాంటి మేకప్ లేకుండా,చాలా క్యాజువల్ గా సెల్ఫీలు తీసుకుంటున్నట్లుగా ఆ ఫోటోలు ఉన్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ మీద వైట్ డాట్స్ తో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   19 Aug 2023 6:43 PM GMT
శివాత్మిక నేచురల్ గానే.. హీటెక్కిస్తోందిగా..
X

స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శివాత్మిక రాజశేఖర్. తల్లి, తండ్రి ఇద్దరూ ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలినవారే. దీంతో, ఆమెకు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. కానీ, నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడింది. మొదటి సినిమా సమయంలోనే విపరీతంగా ట్రోల్ చేశారు. బాడీ షేమింగ్ చేశారు. అందంగా లేవంటూ రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ, ఆ ట్రోల్స్ కి భయపడుకుండా, కేవలం తనకు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయో వాటినే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.


ఇప్పటి వరకు శివాత్మికకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాలేదు. కానీ, వచ్చిన చిన్న చిన్న పాత్రల్లో అయినా, తన మార్క్ మాత్రం చూపిస్తూ వస్తోంది. ఈ బ్యూటీ, సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని షేర్ చేయగా, అవి ఆకట్టుకుంటున్నాయి.

ముఖంపై ఎలాంటి మేకప్ లేకుండా,చాలా క్యాజువల్ గా సెల్ఫీలు తీసుకుంటున్నట్లుగా ఆ ఫోటోలు ఉన్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ మీద వైట్ డాట్స్ తో ఉన్నాయి. క్లీవ్ లెస్ డ్రెస్ లో సొగసులు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మేకప్ లేకున్నా, శివాత్మిక అందంగానే కనపడుతోంది. ఒకప్పుడు ట్రోల్స్ చేసినవారే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలకు ఫిదా అయిపోయి, పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

శివాత్మిక సోదరి శివాణి సైతం ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీరికి తెలుగులో కంటే, తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తుండటం విశేషం. కాగా, శివాత్మిక దొరసానితో కెరీర్ మొదలుపెట్టింది. మొదటి సినిమాలోనే నటనకు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత ఆకాశం, రంగమార్తండ, పంచతంత్ర, ఆంనదం విలయాడం లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించారు.

నిజానికి శివాత్మిక అందరు హీరోయిన్స్ లా గ్లామర్ రోల్స్ కాకుండా, చిన్న సినిమాలు అయినా, ప్రాధాన్యత ఉన్నవాటిని ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఒక మంచి కమర్షియల్ మూవీలో ఛాన్స్ దొరికితే, శివాత్మిక తనను తాను మరింత ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.