Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్సులో శివాత్మిక గ్లామర్ మెరుపులు!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ‘దొరసాని’ సినిమాతో ఎమోషనల్‌ పెర్ఫార్మెన్స్‌కి గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్యకాలంలో మాత్రం సినిమా స్క్రీన్‌పై కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారుతోంది.

By:  Tupaki Desk   |   14 April 2025 5:00 PM IST
Shivathmika Rajasekhar’s Stunning Black Gown Look Shocks Fans
X

టాలీవుడ్‌లో ఒకప్పుడు ‘దొరసాని’ సినిమాతో ఎమోషనల్‌ పెర్ఫార్మెన్స్‌కి గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్యకాలంలో మాత్రం సినిమా స్క్రీన్‌పై కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. బ్లాక్ స్ట్రాపీ గౌన్‌లో క్లాస్ అండ్ గ్లామర్ మిక్స్ చేసిన స్టైల్‌తో షాక్ ఇచ్చింది.

క్యూట్ కాస్ట్యూమ్‌లా ఉండే డిజైన్, మినిమలిస్టిక్ మేకప్, బ్రౌన్ మినీ బ్యాగ్‌తో చాలా క్యాషువల్‌గా కనిపించిందీ బ్యూటీ. ఒక్క ఆభరణం కూడా లేకుండా.. బాడీ లాంగ్వేజ్‌ నమ్ముకొని వచ్చిన ఈ లుక్ ఆమె స్టైలింగ్‌లో కొత్త దారితొరవగా చెప్పవచ్చు. ఈ ఫోటోలన్నీ ఓ షాపింగ్ మాల్ లో తీసుకున్నట్లుగా కనిపిస్తుండగా.. ఆమె నేచురల్ స్కిన్ టోన్, జిమ్ బాడీ వర్క్ అద్భుతంగా హైలైట్ అయ్యాయి.

ముఖంపై కనీస ఉత్కంఠ లేకుండా, పూర్తిగా సర్దుబాటు అయిన స్టైలింగ్‌లో ఆమె ఇచ్చిన పోజులు మరింత హైలెట్ అయ్యాయి. ఫ్యాషన్ ఫొటోషూట్లకు ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక గత రెండేళ్లుగా శివాత్మిక సినిమాల్లో కనిపించలేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫాలోయింగ్ తగ్గలేదు.

హాలోటప్ ఫొటోషూట్లు, ట్రావెల్ స్టోరీస్, బుక్ రివ్యూలతో యూత్‌లో మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చింది. తాజాగా వచ్చిన ఈ బ్లాక్ గౌన్ లుక్ ఆమెకి ఫ్యాన్ బేస్‌ని మరోసారి యాక్టివ్ చేస్తోంది. ఇక 2023లో చివరగా రంగమార్తాండ సినిమాలో నటించిన శివాత్మిక మళ్లీ సినిమాల్లో కనిపించ లేదు. మరి నెక్స్ట్ ఆమె ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.