Begin typing your search above and press return to search.

కన్నడ సూపర్ స్టార్ మరో తెలుగు సినిమా..!

ఆ సినిమా మాత్రమే కాకుండా అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను శివ రాజ్ కుమార్‌ చేసేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 5:24 AM GMT
కన్నడ సూపర్ స్టార్ మరో తెలుగు సినిమా..!
X

కన్నడ సూపర్ స్టార్‌ శివ రాజ్ కుమార్‌ ఒక వైపు కన్నడలో వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ హిట్స్ ను అందుకుంటూ ఉన్నాడు. మరో వైపు ఇతర భాషల సినిమాల్లో ఆయన గెస్ట్‌ రోల్స్ లేదా ముఖ్య పాత్రల్లో నటించడం ద్వారా కూడా ఇతర భాషల ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు.

తాజాగా శివ రాజ్ కుమార్‌ ఘోస్ట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత మరో పెద్ద సినిమాను కన్నడంలో చేస్తున్నాడు. ఇదే సమయంలో తెలుగు లో ఒక సినిమా లో ముఖ్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా చేయబోతున్న సినిమాలో శివ రాజ్ కుమార్‌ నటించబోతున్నాడు. ఆ సినిమా మాత్రమే కాకుండా అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను శివ రాజ్ కుమార్‌ చేసేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.

హిడింభ సినిమాతో దర్శకుడిగా పాజిటివ్ మార్కులు దక్కించుకున్న అనిల్‌ కృష్ణ కన్నెగంటి తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో యంగ్‌ హీరో నటించబోతున్నాడు. ఇక సినిమాలో ముఖ్య పాత్రకు గాను శివ రాజ్ కుమార్‌ ను దర్శకుడు అనిల్ కృష్ణ సంప్రదించాడని, కథ నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.

అనిల్‌ కృష్ణ మరోసారి హిడింభ తరహా కథనే రెడీ చేయడం జరిగిందని, ఈ ఏడాది సమ్మర్‌ నుంచి సినిమాను పట్టాలెక్కించే విధంగా చర్చలు జరుగుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.