Begin typing your search above and press return to search.

శివన్న ఉగ్రరూపం.. ఫుల్‌ యాక్షన్‌ మోడ్​తో ఘోస్ట్ ట్రైలర్‌‌

కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఘోస్ట్​.

By:  Tupaki Desk   |   1 Oct 2023 2:30 PM GMT
శివన్న ఉగ్రరూపం.. ఫుల్‌ యాక్షన్‌ మోడ్​తో  ఘోస్ట్  ట్రైలర్‌‌
X

కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఘోస్ట్​. శివ రాజ్ కుమార్‌ను మరింత మాసీగా, నెక్ట్స్ లెవెల్ యాక్షన్ హీరోగా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్.. సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

రిలీజ్ డేట్ దగ్గపడడంతో తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్​. తెలుగు ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేయడం విశేషం. ప్రచార చిత్రంలోని విజువల్స్, శివన్న డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి.

"యుద్ధం మానవ ప్రపంచానికి మానని ఓ గాయం. ఇలాంటి యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కన్నా కూడా.. అవి చేసే నష్టాలే ఎక్కువ..సామ్రాజ్యాలను నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నో సార్లు మరిచిపోయి ఉండొచ్చు. కానీ విధ్వంసం సృష్టించే నా లాంటి వాడిని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు" అంటూ శివ రాజ్ కుమార్ చెప్పిన డైలాగ్ హైలైట్​గా ఉంది. "నేను ఎవరి జోలికి వెళ్లను.. భయంతో కాదు.. నేను వెళ్తే రణరంగం మారణహోమంలా మారుతుందని" అంటూ చివర్లో శివన్న చెప్పిన డైలాగ్ కూడా హై ఓల్టేజ్​లా ఉంది. ఇక ఈ ప్రచార చిత్రంలో జయరాం, అనుపమ్ ఖేర్‌లను కూడా చూపించారు.

మరి శివన్న వైలెంట్‌ మ్యాన్‌గా ఎందుకు మారారు? ఆయన విధ్వంసం వెనుక కారణాలేంటి? అసలు ఆయన ఉద్దేశం ఏంటనేది సస్పెన్స్‌గా ఉంచుతూ ట్రైలర్‌ కట్ చేసి యాక్షన్​తో నింపేశారు. ఈ చిత్రం ఈనెల 19న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తంగా ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మొత్తం మూడు గెటప్స్‌లో అల‌రించనున్నారు. ఇకపోతే ఈ దసరాకు ఘోస్ట్​తో పాటు తెలుగులో లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కూడా రిలీజ్ కానుంది. ఇవన్నీ కూడా మాస్ యాక్షన్ సినిమాలే కావడం విశేషం.