అమ్మాయిగా పుడితే ఆ హీరోని పెళ్లాడేవాడిని!
శాండిల్ వుడ్ లో శివరాజ్ కుమార్ ఎంత పెద్ద స్టార్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. కొంత కాలంగా ఇండ స్ట్రీని ఏల్తోన్న నటుడు.
By: Tupaki Desk | 19 April 2025 3:50 PM ISTశాండిల్ వుడ్ లో శివరాజ్ కుమార్ ఎంత పెద్ద స్టార్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. కొంత కాలంగా ఇండ స్ట్రీని ఏల్తోన్న నటుడు. హీరోగా కన్నడ పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీల్ని లిఖించుకున్న నటుడు. అలాగని కేవలం మాతృ భాషకే పరిమితం కాలేదు. అవకాశం వచ్చిన ప్రతీ ఇండస్ట్రీలో ఆయన సేవల్ని అందించారు. ఆయన ఇమేజ్కి తగ్గ పాత్రలొచ్చినప్పుడల్లా కాదనకుండా నటించారు.
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారు.` జైలర్` తో తెలుగు నాట మంచి పేరొచ్చింది. దీంతో స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు వస్తున్నాయి. ప్రస్తుతం శివరాజ్ కుమార్ , ఉపేంద్ర కలిసి `45` అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా శివరాజ్ కుమార్, కమల్ హాసన్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. `నాకు అమితాబచ్చన్, కమల్ హాసన్ అంటే ఇష్టం.
వారికి వీరాభిమానిని. కమల్ హాసన్ అంటే అందం. అమ్మాయిగా పుట్టి ఉంటే ఆయన్నే పెళ్లి చేసుకునే వాడిని. చాలా సంవత్సరాల క్రితం నా తండ్రి రాజ్ కుమార్ ను చూసేందుకు కమల్ మా ఇంటికొచ్చారు. అప్పుడు అనుమతి తీసుకుని మరీ కమల్ ని హగ్ చేసుకున్నాను. తర్వాత మూడు రోజుల వరకూ స్నానం చేయలేదు. చేస్తే ఆయన నా నుంచి దూరమవుతారు అన్న ఫీలింగ్ తో. ఆయన అంటే అంత ఇష్టం.
ఇప్పటి వరకూ కమల్ హాసన్ నటించిన ఏ సినిమా మిస్ కాలేదు. అదీ తొలి షో తప్పకుండా చూస్తాను. అయన ఇప్పటికీ ఎంతో పిట్ గా యంగ్ గా కనిపిస్తారు. అలా కనిపించాలని నేను ట్రై చేసాను నా వల్ల కాలేదు. ఆయన చాలా డిసిప్లెన్ గా ఉంటారు. అందుకే అలా మెయింటెన్ చేయగల్గుతున్నారు. అమితాబ్ కూడా అంతే ఫిట్ గా ఉన్నారు. కల్కి 2898 లో ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉంది` అన్నారు.
