Begin typing your search above and press return to search.

'నేనేం చప్పట్లు కొట్టలేదు'.. కమల్ కాంట్రవర్సీపై శివన్న క్లారిటీ!

థగ్ లైఫ్ కర్ణాటక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో కమల్ హాసన్ చేసిన కామెంట్స్.. ఎలాంటి వివాదం రేపాయో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Jun 2025 3:59 PM IST
నేనేం చప్పట్లు కొట్టలేదు.. కమల్ కాంట్రవర్సీపై శివన్న క్లారిటీ!
X

థగ్ లైఫ్ కర్ణాటక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ హీరో కమల్ హాసన్ చేసిన కామెంట్స్.. ఎలాంటి వివాదం రేపాయో అందరికీ తెలిసిందే. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. రాజకీయ నేతలు, నెటిజన్లు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు సహా అనేక మంది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

కానీ కమల్ హాసన్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తాను ఆ వ్యాఖ్యలను ప్రేమతో మాత్రం చేశానని తెలిపారు. ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదని అన్నారు. భాష చరిత్ర గురించి ఎంతో మంది చరిత్రకారులు తనకు చెప్పారని పేర్కొన్నారు. అందుకే తాను ఇప్పటికే చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో వివాదం రేపిన వ్యాఖ్యలను కమల్ చేసిన సమయంలో.. ఆయన పక్కన కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే కమల్ మాట్లాడుతున్నప్పుడు ఆయన చప్పట్లు కొడుతున్న కనిపిస్తున్న వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో శివరాజ్ ఆ కామెంట్స్‌ ను ప్రోత్సహిస్తున్నారని కొందరు నెటిజన్లు మండిపడ్డారు.

తాజాగా దానిపై శివరాజ్ కుమార్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఆ ఈవెంట్‌లో ఏం జరిగిందో తనకు అర్థం కాలేదని తెలిపారు. కానీ ఆ వ్యాఖ్యల సమయంలో తాను చప్పట్లు కొడుతున్నట్లు చూపించారని అన్నారు. తాను అప్పుడు క్లాప్స్‌ కొట్టలేదని చెప్పారు. వేరే స్పీచ్‌ సమయంలో కొట్టానని, అది ఎడిటింగ్‌ లో అలా చేశారని పేర్కొన్నారు.

అయితే సాధారణంగా అన్ని భాషలు ముఖ్యమైనవని శివరాజ్ కుమార్ తెలిపారు. కానీ తన మాతృభాష కన్నడకు అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అందులో ఎలాంటి డౌట్ లేదని స్పష్టం చేశారు. కన్నడ కోసం ప్రాణమైనా ఇస్తానని వెల్లడించారు. ఇప్పటికే ఇంతకుముందే అదే విషయాన్ని పలుమార్లు చెప్పానని తెలిపారు శివన్న.

కానీ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని తాను చెప్పకూడదని శివరాజ్ కుమార్ అన్నారు. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ యాక్టర్ అని చెప్పారు. కమల్ మూవీలు కచ్చితంగా చూస్తానని, తాను వీరాభిమాని అని చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఆ విషయంలో ఏం చేస్తారో వేచి చూడాలి.