Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఆ ఇద్ద‌రి మ‌జిలీ మొద‌లైందా?

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయకుడిగా శివ నిర్వాణ తెర‌కెక్కించిన 'మ‌జిలీ' ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Nov 2023 1:30 PM GMT
మ‌ళ్లీ ఆ ఇద్ద‌రి మ‌జిలీ మొద‌లైందా?
X

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయకుడిగా శివ నిర్వాణ తెర‌కెక్కించిన 'మ‌జిలీ' ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. చైత‌న్య‌-స‌మంత‌ల జోడీ పెళ్లైన త‌ర్వాత జంట‌గా క‌లిసి న‌టించిన తొలి చిత్రం ఇదే. భార్య‌-భ‌ర్త‌ల అనుబంధాన్ని..ప్రేమికుల రిలేష‌న్ షిప్ ని హైలైట్ చేస్తూ రూపొందిచిన సినిమా ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అయింది. మ‌జిలీ విజ‌యంతో చైత‌న్య ఇమేజ్ రెట్టింపు అయింది.

ఇలాంటి క‌థ‌ల్లో చైత‌న్య మాత్ర‌మే ఒదిగిపోతాడని మ‌రోసారి రుజువు చేసిన చిత్ర‌మిది. సెన్సిబుల్ అంశాల‌తో శివ మార్క్ మేకింగ్ ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇదే కాంబినేష‌న్ లో మ‌రో సినిమాకి రంగం సిద్ద‌మ‌వు తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగ‌చైత‌న్య రివీల్ చేసారు. 'శివ నిర్వాణ-నేను ఓ సినిమా చేయాలి. దాని గురించి మేం రోజు మాట్లాడుకుంటున్నాం.

ప్ర‌స్తుతానికి ఆ క‌థ‌పైనే దృష్టి పెట్టా' అని తెలిపారు. చైత‌న్య వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి శ‌వ‌తో క‌న్ప‌మ్ అయింది. కానీ ఇంకా స్టోరీ లాక్ అయిన‌ట్లు లేదు. స్టోరీల విష‌యంలో చైత‌న్య ఇన్వాల్వ్ అవుతుంటారు. క‌థ చెబితే దానికి అవ‌స‌ర‌మైన డ‌వ‌లెప్ మెంట్స్ సూచిస్తారు. ఇలా ఉంటే బాగుంటుంది? అనే ఓ ఐడియా ఇస్తుంటారు. ప్ర‌స్తుతం శివ‌తో ఆ ర‌క‌మైన డిస్క‌ష‌న్స్ సాగుతున్నాయి. టాలీవుడ్ మ‌ణిర‌త్నం గా పేరు తెచ్చుకున్న శివ కి ర‌చ‌యిత‌గా మంచి పేరుంది.

ద‌ర్శ‌కుడి కాక‌ముందు ర‌చ‌న‌పై మంచి పట్టుంది. ఆయ‌న క‌థ‌లు ఆయ‌నే స్వ‌యంగా రాసుకుంటాడు. అవ‌స‌ర‌మైతే ఆయ‌నే గీత ర‌చ‌యిత‌గానూ మారిపోతారు. మ‌జిలీ పాట‌ల్లో ఆయ‌న హ‌స్తం ఉంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఖుషీలో అన్ని పాట‌లు ఆయ‌నే రాసాడు. ఖుషీ రిలీజ్ కి ముందే మ్యూజికల్ గా ఓ సెన్షేష‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చైత‌న్య ప్రాజెక్ట్ లో త‌ల‌మున‌క‌ల‌య్యారు. చైతన్య ముందుగా చందు మొండేటి ప్రాజెక్ట్ ని పూర్తిచేసిన త‌ర్వాత శివ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించనున్నారు.