Begin typing your search above and press return to search.

విజయ్ - సమంత లిప్ లాక్.. శివ నిర్వాణ క్లారిటీ ఇదే..!

సమంత, విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్ సీన్స్ పెట్టారు , రెండు సార్లు అది కూడా పాటలో అవసరమా అని అడిగారు.

By:  Tupaki Desk   |   1 Sep 2023 1:04 PM GMT
విజయ్ - సమంత లిప్ లాక్.. శివ నిర్వాణ క్లారిటీ ఇదే..!
X

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ఖుషీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీలో సమంత, విజయ్ దేవర కొండలు ఎలాంటి మ్యాజిక్ చేస్తారా అని ఆశగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరపడింది. ఈ మూవీకి ప్రస్తుతం మిక్సడ్ టాక్ నడుస్తోంది. కొందరు సమంత, విజయ్ ల మధ్య కెమిస్ట్రీ బాగుందని కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం కథలో కొత్తదనం లేదని పెదవి విరిచేస్తున్నారు.

ఎక్కువ మందికి మూవీ నచ్చినట్లు తెలుస్తోంది. టాక్ సంగతి పక్కన పెడితే, ఈ మూవీ విడుదలైన తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. దీనిలో భాగంగా లిప్ లాక్ సీన్స్ గురించి విలేకరులు ప్రశ్నించగా, ఆయన దానికి చాలా కన్విన్సింగ్ గా సమాధానం చెప్పడం విశేషం.

సమంత, విజయ్ దేవరకొండ మధ్య లిప్ లాక్ సీన్స్ పెట్టారు , రెండు సార్లు అది కూడా పాటలో అవసరమా అని అడిగారు. అయితే, దానికి డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. అక్కడ సమంత కాదని, క్యారెక్టర్ ఆరాధ్య అని చెప్పారు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, పెళ్లి జరిగి కూడా సంవత్సరం అవుతుందని, పిల్లల కోసం వారు స్ట్రగుల్ అవుతూ ఉంటారని, అలాంటి జంట మధ్య లిప్ లాక్ అనేది ఒక ఎమోషన్ అని చెప్పారు. వారు నిజంగా పెళ్లైన వారిలా కనిపించాలంటే, అది అవసరం అనిపించిందని, అందుకే పెట్టినట్లు చెప్పారు.

ఇక, ఆ లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు సమంత, విజయ్ రియాక్షన్ ఏంటి అని మరొకరు అడగగా, తాను యాక్షన్ అని చెప్పగానే వారు చేశారని, కట్ చెప్పగానే సీన్ అయిపోయిందని, అది కూడా పార్ట్ ఆఫ్ వర్క్ మాత్రమే అని చెప్పారు. ఇక, ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రను ప్రముఖ ప్రవచన కర్త చాగంటిని ఉద్దేశించి పెట్టారా అని కూడా ప్రశ్నించారు.

అయితే, ఆ వర్గానికి చెందిన వారిలా ఉండాలని పెట్టానని, కేవలం ఆయననే స్పెషల్ గా ఉద్దేశించి పెట్టలేదని చెప్పారు. ఇక, ఇలాంటి సినిమాను అన్ని వర్గాల వారు ఆదరిస్తారనే నమ్మకంతో తాను ఈ మూవీ చేశానని ఆయన చెప్పారు.