Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : అందాల బొమ్మాళి అదుర్స్‌

ఈసారి ఈ అమ్మడు నలుపు రంగు క్రాప్ టాప్‌ ధరించి మ్యాచింగ్ ప్యాంట్‌ లో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   22 March 2024 9:52 AM GMT
పిక్‌ టాక్ : అందాల బొమ్మాళి అదుర్స్‌
X

టాలీవుడ్ సీనియర్ స్టార్‌ హీరో రాజశేఖర్‌, సీనియర్ హీరోయిన్‌ జీవిత కూతురు శివాని రాజశేఖర్‌ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటో షూట్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.


ఈసారి ఈ అమ్మడు నలుపు రంగు క్రాప్ టాప్‌ ధరించి మ్యాచింగ్ ప్యాంట్‌ లో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. నడుము అందాన్ని చూపిస్తూ కవ్విస్తున్న శివాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోదరి శివాత్మిక తో పోల్చితే శివాని మరింత అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా సరైన గుర్తింపు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. తెలుగు లో హీరోల కూతుళ్ల కు పెద్దగా ఆఫర్లు దక్కవు. ఇప్పుడు శివాని విషయంలో కూడా అదే జరుగుతుంది.


ఇటీవల కోటబొమ్మాళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరోసారి ఒక విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈ అమ్మడి యొక్క కొత్త సినిమా ప్రకటన ఉండే అవకాశం ఉంది.