Begin typing your search above and press return to search.

బాత్రూమ్ వీడియో పెడితే.. ఇంత రాద్దాంతం అవసరమా?

అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ వీడియో మాత్రం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో శివజ్యోతి బాత్‌రూంలో స్నానం చేస్తూ కనిపించారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 4:00 PM IST
బాత్రూమ్ వీడియో పెడితే.. ఇంత రాద్దాంతం అవసరమా?
X

‘తీన్మార్ సావిత్రక్క’గా గుర్తింపు పొందిన శివజ్యోతి, బిగ్‌బాస్ హౌస్‌కి ఎంట్రీ ఇచ్చిన తరువాత మరింత పాపులర్ అయిన విషయం తెలిసిందే. అందం, అభినయంతో పాటు తన మాటలతో ఆకట్టుకునే ఈ యాంకరమ్మ బిగ్‌బాస్ తర్వాత యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్ వేదికలపై యాక్టివ్‌గా మారారు. హోమ్ వ్లాగ్స్‌, ట్రావెల్ వీడియోలు, సీరియస్ డిస్కషన్స్ ఇలా ఎన్నో విభిన్న కంటెంట్లతో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ వీడియో మాత్రం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో శివజ్యోతి బాత్‌రూంలో స్నానం చేస్తూ కనిపించారు. ఆమె ఈ వీడియోను ఓ బాడీ వాష్ బ్రాండ్ కోసం తెరకెక్కించారు. ప్రొఫెషనల్ ప్రమోషన్‌ అయినప్పటికీ, దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం.

కొంతమంది దీనిని భిన్నమైన కామెంట్స్ చేయగా, మరికొందరు ఇది ప్రొడక్ట్ ప్రమోషన్ మాత్రమేనని చెప్పుకుంటున్నారు. కామెంట్స్‌లో ఫాలోవర్స్ కోసం ఇంతగా అవసరమా? అని కొందరు అంటుంటే.. ఇది ప్రమోషనల్ కంటెంట్ మాత్రమే.. దానికి ఇంత రాద్దాంతం ఎందుకు అని మరికొందరు అంటున్నారు. ఇక ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా శివజ్యోతి నల్లని చీర బాగుంది అని అడిగిన వారికి కామెంట్స్ లింక్స్ పెట్టేస్తోంది.

భర్తను ఎలా ఇంప్రెస్ చేయాలి అనే క్యాప్షన్ తో తన ఆలోచనను చెప్పకనే చెప్పేసింది. ఇక శివజ్యోతి కెరీర్ విషయానికి వస్తే, బిగ్‌బాస్ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ కంటెంట్‌లోనూ కనిపించారు. యాంకరింగ్‌తో పాటు నటనపైనా ఫోకస్ పెడుతున్న ఆమె, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బ్రాండింగ్ అవకాశాలను కూడా అద్భుతంగా వినియోగించుకుంటున్నారు.

స్టైలిష్ లుక్స్‌, గ్లామరస్ ఫొటోషూట్స్‌తో తన అభిమానులకు అల్టిమేట్ విజువల్ ఫీట్ అందిస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో ఆమె తన ఆలోచన విధానంతో ఆడియెన్స్ కు ఇంకాస్త దగ్గరైంది. ఇక నటిగా వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రూట్లో ఈమధ్య యాంకర్స్ మంచి క్రేజ్ అందుకుంటున్నారు. మరి శివజ్యోతి కెరీర్ ను మార్చే పాత్ర ఎప్పుడు దక్కుతుందో చూడాలి.