Begin typing your search above and press return to search.

OTTలు వాటిని ఎంకరేజ్ చేయాలంటున్న శివాజీ..!

అయితే ఈ వెబ్ సీరీస్ సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో థ్రిల్లర్ సీరీస్ లనే కాదు ఫ్యామిలీ సీరీస్ లను ఎంకరేజ్ చేయాలని అన్నారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 9:21 AM GMT
OTTలు వాటిని ఎంకరేజ్ చేయాలంటున్న శివాజీ..!
X

90కి పైగా సినిమాలు చేసిన హీరో శివాజీ మధ్యలో కాస్త ఫాం కోల్పోయాడు. అయితే రీ ఎంట్రీ కోసం బిగ్ బాస్ షోకి వెళ్లిన అతను సీజన్ 7 టాప్ 3 వరకు వచ్చాడు. శివాజీ కాస్త శివన్నగా మారగా వచ్చీ రాగానే అతను నటించిన #90's వెబ్ సీరీస్ రిలీజ్ అయ్యింది. బిగ్ బాస్ వేడితో పాటుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడంతో #90's వెబ్ సీరీస్ ని అందరు ఆదరించారు. ఈటీవీ విన్ లో రిలీజైన #90's వెబ్ సీరీస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ వెబ్ సీరీస్ ని ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేయగా నవీన్ మేడారం నిర్మించారు.

అయితే ఈ వెబ్ సీరీస్ సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో థ్రిల్లర్ సీరీస్ లనే కాదు ఫ్యామిలీ సీరీస్ లను ఎంకరేజ్ చేయాలని అన్నారు. కేవలం కొరియన్ సీరీస్ లను స్పూర్తిగా పొంది మన దగ్గర సీరీస్ లు చేయడం కాదు ఇక్కడ ఫ్యామిలీ సీరీస్ లను చేయాలని.. ఓటీటీలు ఫ్యామిలీ సీరీస్ లను నిర్మించాలని అన్నారు. శివాజీ చెప్పారని కాదు కానీ వెబ్ సీరీస్ అనగానే థ్రిల్లర్ అనే బలంగా నమ్మేలా సీరీస్ లు చేస్తున్నారు.

ఆడియన్స్ కి అవి ఎక్కువ నచ్చుతాయనో లేక అవైతేనే ఓటీటీ ఆడియన్స్ చూస్తారనో కానీ ఓటీటీ సీరీస్ అంటే చాలు 90 శాతం థ్రిల్లర్ అంశాలతోనే తెరకెక్కిస్తున్నారు. అవి కూడా కొరియన్, జపాన్ సీరీస్ లను స్పూర్తిగా పొంది చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ సీరీస్ లు కూడా తీస్తే చూసేందుకు ఆడియన్స్ రెడీగా ఉన్నారని కొన్ని సీరీస్ లు ప్రూవ్ చేశాయి. లేటెస్ట్ గా #90's వెబ్ సీరీస్ కూడా అందుకు నిదర్శనమని చెప్పొచ్చు.

శివాజీ, వాసుకీ కలిసి నటించిన ఈ వెబ్ సీరీస్ ఏడు ఎపిసోడ్స్ తో వచ్చింది. టైటిల్ కి తగినట్టుగానే 90స్ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ సీరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఈ సీరీస్ సక్సెస్ తో ఇలాంటి వెబ్ సీరీస్ లు ఎన్నో రావాలని కోరుతున్నారు ఆడియన్స్. శివాజీ కూడా వెబ్ సీరీస్ అంటే థ్రిల్లర్ లే కాకుండా ఫ్యామిలీ సీరీస్ లను కూడా చేస్తే బెటర్ అని అంటున్నారు. ఓటీటీ సంస్థలు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వెబ్ సీరీస్ లుగా చేస్తే ఫ్యామిలీస్, చిల్డ్రెన్స్ కూడా కూడా వెబ్ సీరీస్ లు చూసే అవకాశం ఉంటుంది.