Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : టాప్ ప్లేస్ కోల్పోయిన శివాజి.. వాళ్లిద్దరి మధ్యే టైటిల్ ఫైట్..!

అయితే మొన్నటిదాకా శివాజి సరైన ఆటతో ఆడుతున్నాడని భావించినా అమర్ దీప్ ని కెప్టెన్ కాకుండా చేసిన విధానం చూసి ఆడియన్స్ కొద్దిగా తమ ఆలోచన మార్చుకున్నారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:45 AM GMT
బిగ్ బాస్ 7 : టాప్ ప్లేస్ కోల్పోయిన శివాజి.. వాళ్లిద్దరి మధ్యే టైటిల్ ఫైట్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 లో టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే ఇప్పుడే నిర్ణయించడం కష్టమని చెప్పొచ్చు. అయితే పాసిబిలిటీస్ ఏంటన్నది ఇప్పటికే దాదాపు తెలిసిపోయింది. టాస్కుల్లో పెద్దగా పర్ఫార్మ్ చేయకపోయినా తన మైండ్ గేమ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు శివాజి. ప్రతి దానిలో లాజిక్ ఆలోచిస్తూ మొదట్లో అతని ఆట తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అంతేకాదు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, యావర్ లకు అతను ఇచ్చిన సపోర్ట్ అతన్ని హీరో చేసింది.

అంతేకాదు స్టార్ మా బ్యాచ్ కి అగైనెస్ట్ గా ఉంటూ వారిని ఎక్కడ వెనక్కి నెట్టాలో అక్కడ వెనక్కి నెడుతూ వచ్చాడు. అయితే మొన్నటిదాకా శివాజి సరైన ఆటతో ఆడుతున్నాడని భావించినా అమర్ దీప్ ని కెప్టెన్ కాకుండా చేసిన విధానం చూసి ఆడియన్స్ కొద్దిగా తమ ఆలోచన మార్చుకున్నారు.

శివాజి కావాలనే అమర్ దీప్ ని కెప్టెన్ కాకుండా చేశాడు. అమర్ ఎంత బతిమిలాడినా సరే శివాజి కనికరించలేదు. పైగా అమర్ ఎమోషనల్ అవుతుంటే బదులుగా వెటకారంగా ఆన్సర్ ఇచ్చాడు. అర్జున్ వాళ్ల వైఫ్ కి తను మాట ఇచ్చానని చెప్పి అమర్ ని కెప్టెన్ కాకుండా చేశాడు. అయితే ఇన్నాళ్లు శివాజి ఏం చేసినా కరెక్టే అనుకునే ఆడియన్స్ అమర్ ని అతను కెప్టెన్ కాకుండా చేసిన విధానాన్ని చూసి వార్ నిర్ణయం మార్చుకున్నారు.

అంతేకాదు నిన్నటిదాకా టైటిల్ రేసులో ఉన్న శివాజి ఒక్క ఎపిసోడ్ తో ఆ రేసు నుంచి గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నాడు. నిన్న మొన్నటిదాకా శివాజి మొదటి ప్లేస్ సెకండ్ పల్లవి ప్రశాంత్, థర్డ్ అమర్ దీప్ ఇలా సీరియల్ ఉండేది కానీ ఎప్పుడైతే శివాజి అమర్ ని కెప్టెన్ కానివ్వకుండా అడ్డుపడ్డాడో శివాజి ఒక్కసారిగా థర్డ్ ప్లేస్ లోకి వచ్చాడు.

ఇప్పుడు టైటిల్ రేసులో అమర్, పల్లవి ప్రశాంత్ లు మాత్రమే ఉన్నారు. ఫైనల్ వీక్ ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ దీప్ ఓటింగ్ జరుగుతుంది. వారిద్దరిలో అమర్ దీప్ కి ఎలాగు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉంది కాబట్టి అతను టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా వచ్చి బిగ్ బాస్ ఆడియన్స్ మనసులు గెలిచాడు. అతను విన్నర్ అయితే రికార్డే అవుతుంది. రన్న అయినా కూడా అతని గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంది. టైటిల్ కొడతాడని అనుకున్న శివాజి టాప్ 3 కి పడిపోయాడు. రాబోయే 3 వారాల్లో ఏమన్నా అతను మళ్లీ టాప్ ప్లేస్ కి వెళ్తాడేమో చూడాలి.