Begin typing your search above and press return to search.

వయసు ప్రభావం.. ప్రశాంత్ అరెస్ట్ పై శివాజి షాకింగ్ రియాక్షన్..!

చట్టం తన పని తాను చేసుకుంటుంది. పల్లవి ప్రశాంత్ కి ఏమి అవ్వదు. తనకు నేనున్నా అంటూ చెప్పుకొచ్చారు శివాజి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 9:20 AM GMT
వయసు ప్రభావం.. ప్రశాంత్ అరెస్ట్ పై శివాజి షాకింగ్ రియాక్షన్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అనూహ్యంగా చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ జరిగిన తర్వాత పోలీసుల మాటను పట్టించుకోకుండా ఫ్యాన్స్ తో ర్యాలీ చేసి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టానికి కారణమయ్యాడని పల్లవి ప్రశాంత్ మీద పలు రకాల సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ జరిగినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ గురించి ఒకరిద్దరు హౌస్ మెట్స్ తప్ప మిగతా వారు స్పందించలేదు. ముఖ్యంగా హౌస్ లో నా బిడ్డ పల్లవి ప్రశాంత్ అనుకుంటూ వచ్చిన శివాజి ఈ అరెస్ట్ వ్యవహరంపై స్పందించలేదు.

శివాజి ఎందుకు స్పందించలేదు అనుకుంటున్న టైం లో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి స్పందించిన శివాజి నాలుగు నెలలుగా ఒక దగ్గర ఉన్నామని పల్లవి ప్రశాంత్ మంచి వాడు.. అయితే గెలిచిన ఆ టైం లో వయసు ప్రభావం వల్ల తను అలా ప్రవర్తించి ఉండొచ్చని అన్నారు. అంతేకాదు అతను అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో తను టచ్ లో ఉన్నానని తను మీ అందరికీ తెలిసేలా చేయాల్సిన అవసరం లేదని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడానని అన్నారు.

చట్టం తన పని తాను చేసుకుంటుంది. పల్లవి ప్రశాంత్ కి ఏమి అవ్వదు. తనకు నేనున్నా అంటూ చెప్పుకొచ్చారు శివాజి. శివాజి స్పందించడం లేట్ అయ్యేసరికి పల్లవి ప్రశాంత్ తో అతని స్నేహం అంతా హౌస్ లోనేనా బయటకు వచ్చాక జరిగిన విషయాల మీద శివాజి ఎందుకు స్పందించలేదని కొందరు కామెంట్ చేశారు. దానికి వివరణ ఇస్తూ పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ తో తను మాట్లాడుతున్నానని మీ అందరికీ తెలిసేలా నేను కనిపించాలని లేదని అన్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్ ఒక జట్టుగా ఆట ఆడారు. వీరు ముగ్గురు టాప్ 5లో నిలిచారు. పల్లవి ప్రశాంత్ సీజన్ విన్నర్ గా టైటిల్ గెలవగా అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. శివాజి థర్డ్ ప్లేస్ లో నిలిచాడు. బిగ్ బాస్ ఆరు సీజన్లలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. సీజన్ 7 కి ఇలా జరగడం పట్ల కంటెస్టెంట్స్ అంతా కూడా డిజప్పాయింట్ గా ఉన్నారు.

పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై ఆడియన్స్ లో కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రైతు బిడ్డ పేరు చెప్పి పల్లవి ప్రశాంత్ సింపతీ ఆట ఆడాడు బయటకు వచ్చాక తన ఫాలోయింగ్ చూసి ఒరిజినాలిటీ బయట పెట్టాడని అంటుండగా కొందరు మాత్రం పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ కాబట్టే అతన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా పోలీసులు చెప్పినా సరే వారి మాట కాదని ఫ్యాన్స్ తో కలిసి విధ్వంసం సృష్టించడం వల్లే అతనికి ఇలాంటి ఫలితం దక్కిందని చెప్పొచ్చు.