Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ : బిగ్ బాస్ కి వార్నింగ్‌ ఇచ్చిన శివాజీ

తాజా ఎపిసోడ్ లో ఒక వైపు శివాజీ తనకు కాఫీ ఫౌడర్‌ కావాల్సిందే అంటూ ఆగ్రహంతో మండి పడుతున్న సమయంలో బిగ్ బాస్‌ కామెడీ చేసేందుకు ప్రయత్నించాడు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 4:05 AM GMT
బిగ్‌ బాస్‌ : బిగ్ బాస్ కి వార్నింగ్‌ ఇచ్చిన శివాజీ
X

బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్ ల మాదిరిగా ఉండదు అంటూ మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ గాంభీర్యంగా ప్రతి విషయం లో కూడా సీరియస్ గా ఉండేవాడు. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ మొదటి నుండే కంటెస్టెంట్స్ తో సరదాగా ఉంటున్నాడు. జోకులు వేస్తున్నాడు, పంచ్ లు వేస్తూ సరదాగా ఉంటున్నాడు.

తాజా ఎపిసోడ్ లో ఒక వైపు శివాజీ తనకు కాఫీ ఫౌడర్‌ కావాల్సిందే అంటూ ఆగ్రహంతో మండి పడుతున్న సమయంలో బిగ్ బాస్‌ కామెడీ చేసేందుకు ప్రయత్నించాడు. తనకు గంటలో కాఫీ ఫౌడర్‌ పంపించకుంటే ఏం జరుగుతుందో అన్నట్లుగా బిగ్ బాస్ కే వార్నింగ్‌ ఇవ్వడంతో పాటు కాలితో వస్తువులను తన్నడం, డోర్ తీయండి వెళ్లి పోతాను అని అరవడం చేశాడు.

శివాజీ ఒక వైపు ఫైర్ మీద ఉన్న సమయంలో బిగ్ బాస్ మాత్రం సిల్లీగా బీపీ చూసే మిషన్‌ ను పంపించి ఒక సారి ఆయన బీపీ చెక్ చేయమని చెప్పడం జరిగింది. తాను కోపంతో ఉంటే బీపీ చూడమని చెప్పడం ఏంటి అంటూ శివాజీ మరింత ఊగిపోయాడు. నాకు బీపీ చూస్తావా అంటూ గౌతమ్ పై శివాజీ మరింత గా ఫైర్ అయ్యాడు. అప్పుడు గౌతమ్ సైలెంట్ అయ్యాడు.

ఆ తర్వాత స్టెతస్కోప్ ను పంపించి ఈ విషయం లో అందరి గుండె ఏం చెబుతుందో వినమంటూ రతిక కి బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు రతిక చేతిలో ఉన్న స్టెతస్కోప్ ను శివాజీ లాగేసుకుని మరింత ఫ్రస్టేషన్ కి గురి అయ్యాడు. మొత్తానికి శివాజీ కోపం తో రగిలి పోతున్నా కొద్ది బిగ్‌ బాస్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు.

శివాజీ చేసింది ఓవర్ యాక్షన్ అయితే బిగ్ బాస్ చేసింది డబుల్ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. బిగ్ బాస్‌ ఇంట్లో ఉండి కాఫీ కావాలి, బూస్ట్‌ కావాలి అంటే ఎలా వస్తుంది. అక్కడ బిగ్ బాస్ ఇవ్వాలి అనుకున్నవే ఇస్తాడు. బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ప్రతి సారి కంటెస్టెంట్స్ కు ఏం అవసరమో అవే ఇస్తూ ఉంటాడు. కనుక శివాజీ రిక్వెస్ట్‌ గా అడిగి ఉండాల్సిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక శివాజీ చేసిన హడావుడి చూసి చాలా మంది సీక్రెట్ టాస్క్ అనుకున్నారు. సాధారణంగా అయితే ప్రేక్షకులకు సీక్రెట్‌ టాస్క్ గురించి ముందే తెలుస్తుంది. ఇది ఉల్టా ఫల్టా సీజన్ కనుక బిగ్ బాస్ షో లో ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు కూడా క్లారిటీ ఇవ్వకుండా ఇలాంటి సీక్రెట్ టాస్క్ లు ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.