నక్సలైట్ అవుదామనుకున్నా: సీనియర్ నటుడు
నటుడు శివాజీ రాజా గురించి అందరికీ తెలిసిందే. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అమృతం సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
By: Tupaki Desk | 11 May 2025 6:30 PMనటుడు శివాజీ రాజా గురించి అందరికీ తెలిసిందే. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అమృతం సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లో హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా అనేక సినిమాలు తీసి సందడి చేశారు శివాజీ రాజా.
ఇప్పుడు వాటన్నింటినీ వదిలేసినట్లు కనిపిస్తున్నారాయన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. తన లవ్ స్టోరీ, అలవాట్లు గురించి పంచుకున్నారు. ఆ సమయంలో తాను నక్సలైట్ అవుదాం అనుకున్నానని తెలిపారు. తనపై ప్రజా గాయకుడు గద్దర్ ఎఫెక్ట్ బాగా ఉండేదని శివాజీ రాజా తెలిపారు.
సాధారణంగా ఎవరైనా లాయర్ అవ్వాలని అనుకుంటారని, డాక్టర్ అవ్వాలనుకుంటారని, కానీ తాను నక్సలైట్ అవ్వాలనుకున్నానని వెల్లడించారు. కానీ అలా అయ్యి ఉంటే ఇప్పటి వరకు ఉండేవాడిని కాదేమోనని వ్యాఖ్యానించారు. అయితే తాను ముంబైలో ఉన్న ఓ అమ్మాయిని లవ్ చేశానని తెలిపారు. టీవీలో చూసేవాడిని చెప్పారు.
ఆమె ఎవరో తెలిస్తే నవ్వుతారని, వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ కు తెల్ల చీరకట్టుకుని వచ్చిన అమ్మాయిని లవ్ చేశానని తెలిపారు శివాజీ రాజా. అందుకే తన భార్యకు ఆమె ఇప్పటికీ నచ్చదని చెప్పారు. తాను పార్టీలకు, పబ్ లకు వెళ్లనని, రెండే పెగ్స్ తాగుతానని చెప్పారు. కానీ అందుకు మాత్రం రెండు గంటలు తాగుతానని అన్నారు.
సిగరెట్స్ మాత్రం చాలా ఎక్కువగా కాల్చేవాడినని, 2000 డిసెంబర్ 31వ తేదీన మెగాస్టార్ చిరంజీవి గారిపై ఒట్టేశానని తెలిపారు. సిగరెట్లు తాగనని చేతిలో చేయి వేసి చెప్పానని అన్నారు. అందుకే ఇప్పటి వరకు అగ్గిపుల్ల కూడా వెలిగించలేదని పేర్కొన్నారు. తనకు కుక్కపిల్లను పెంచుకోవాలని 30 ఏళ్ల నాటి కలగా చెప్పారు.
ఎక్కడైనా కుక్క పిల్ల కనిపిస్తే, తెచ్చి స్నానం చేయించేవాడినని తెలిపారు. స్నానం అయ్యాక కరిచేసి వెళ్లిపోయేదని చెప్పారు. ఇప్పుడు పెంచుకుందామంటే.. తన భార్యకు కుక్కలంటే భయమని, మనుషుల్ని పెంచుకోవడం కంటే కుక్కల్ని పెంచుకోండిరా అని పూరీ జగన్నాథ్ చెప్పినట్లు తెలిపారు. అన్నం పెట్టినా పెట్టకపోయినా విశ్వాసంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.