హ్యాట్రిక్ 'దండోరా' మోగించేస్తారా..?
కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అభిరుచి గల నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు
By: Tupaki Desk | 7 April 2025 1:56 PMకలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అభిరుచి గల నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. కలర్ ఫోటో తర్వాత బెదురులంక 2012 తో కూడా సక్సెస్ అందుకున్నారు ఆయన. ఇక ఆ బ్యానర్ నుంచి థర్డ్ ప్రాజెక్ట్ గా చేస్తున్న సినిమా దండోరా. శివాజి, నవదీప్, మోనికా రెడ్డి, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మురళీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ అయిన ఫస్ట్ బీట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దండోరా సినిమా మీద ఈ సాంగ్ మంచి బజ్ ఏర్పడింది.
ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. మెదక్ జిల్లాలో దరిపల్లి విలేజ్ లో షూటింగ్ చేస్తున్నారు. దాదాపు 25 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. శివాజితో పాటు మిగతా కాస్ట్ తో ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.
దండోరా లాంటి పవర్ ఫుల్ టైటిల్ తో ఇదివరకు ఒక సినిమా వచ్చింది. ఈ దండోరా కూడా సోషల్ కాజ్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు వెంకట్ శాఖమూరి కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. దండోరా సినిమాకు మార్క్ కె రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారు.
రీసెంట్ గా కోర్ట్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు శివాజి. నాని నిర్మాతగా రామ్ జగదీశ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శివాజి తన పాత్రలో అదరగొట్టారు. ఇండస్ట్రీ లో ఎన్నో ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న శివాజి కోర్ట్ సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేశారు. దండోరా సినిమా లో కూడా శివాజి విలేజ్ గెటప్ లో అదర గొట్ట బోతున్నారని తెలుస్తుంది.
కోర్ట్ సక్సెస్ తర్వాత శివాజి నుంచి రాబోతున్న ఈ దండోరా కూడా మంచి అంచనాలు ఏర్పరచుకుంటుందని చెప్పొచ్చు. దండోరా సినిమా కచ్చితంగా ఆడియన్స్ కు ఒక ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు చేస్తారన్నది చూడాలి.