Begin typing your search above and press return to search.

శివాజీ కామెంట్స్ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోందే?

న‌టుడు శివాజీ చేసిన కామెంట్‌లు ప‌ని చేస్తున్నాయా?.. ఇండ‌స్ట్రీలో భారీ మార్పులు తీసుకొస్తున్నాయా?... త‌న వ్యాఖ్య‌ల కార‌ణంగానే చాలా య‌మంది హీరోయిన్‌ల‌లో చ‌ల‌నం మొద‌లైందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

By:  M Prashanth   |   13 Feb 2026 7:00 AM IST
శివాజీ కామెంట్స్ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోందే?
X

న‌టుడు శివాజీ చేసిన కామెంట్‌లు ప‌ని చేస్తున్నాయా?.. ఇండ‌స్ట్రీలో భారీ మార్పులు తీసుకొస్తున్నాయా?... త‌న వ్యాఖ్య‌ల కార‌ణంగానే చాలా య‌మంది హీరోయిన్‌ల‌లో చ‌ల‌నం మొద‌లైందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న వ్యాఖ్య‌ల ప్ర‌భావం చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వివారాల్లోకి వెళితే.. న‌టుడు శివాజీ `దండోరా` సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ `హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌ల‌లోనే ఉంటుంద‌న్నారు. న‌టీమ‌ణులు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలి.

ఇలా చెబుతున్నందుకు ఏమీ అనుకోవ‌ద్దు. మీ అందం మొత్తం నిండుగా వేసుకునే దుస్తుల్లోనే ఉంటుంది. ఫ్యాష‌న్ దుస్తులు వేసుకున్న‌ప్పుడు అంద‌రూ బాగున్నాయ‌నే అంటారు కానీ లోప‌ల మాత్రం తిట్టుకుంటారు. స్త్రీ అంటే ప్ర‌కృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌర‌వం పెరుగుతుంది. మా అమ్మ..అంటే న‌టి సావిత్రి ఎప్ప‌టికీ నిండైన రూపంతో గుండెల్లో క‌న‌బ‌డుతూ ఉంటుంది. అప్ప‌ట్లో సౌంద‌ర్య‌, ఇప్ప‌ట్లో ర‌ష్మిక చ‌క్క‌గా ఉంటారు. గ్లామ‌ర్ ఉండాలి కానీ దానికో హ‌ద్దు ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవ‌ద్దు. ప్ర‌పంచ వేదిక‌ల‌పై చీర‌క‌ట్టులో వ‌చ్చిన వారికే విశ్వ‌సుంద‌రి కిరీటాలు వ‌చ్చాయి`

అంటూ శివాజీ చేసిన వ్యాఖ్య‌లు `సామాన్లు..` అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి తెర‌లేపిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై అనసూయ‌, నాగ‌బాబు, ప్ర‌కాష్ రాజ్‌, రామ్ గోపాల్ వ‌ర్మ‌తో పాటు ప‌లువురు విరుచుకుప‌డ్డారు. తెలంగాణ మ‌హిళా క‌మీష‌న్ వ‌ర‌కు వెళ్ల‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా శివాజీ హీరోయిన్‌ల డ్రెస్ సెన్స్‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ త‌రువాత నుంచి ఇండస్ట్రీలో ఏ సినిమా ఈవెంట్ జ‌రిగినా హీరోయిన్‌లు అత్య‌ధిక శాతం శారీస్‌ల‌లో క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఇదే విష‌యాన్ని తాజాగా సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ గుర్తు చేశారు. సుహాస్, శివానీ నాగారం జంట‌గా న‌టించిన మూవీ `హే భ‌గ‌వాన్‌`. గోపీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. యాంక‌ర్ స్ర‌వంతి, న‌రేష్‌, సుద‌ర్శ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో టీమ్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో న‌టించిన సీనియ‌ర్ న‌రేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల త‌రువాత సినిమా వేడుక‌ల్లో మ‌హిళ‌లంద‌రూ చీర‌లోనే క‌నిసిస్తున్నార‌న్నారు.

అలా ఉండ‌టం జాతీయ సంస్కృతి అన్నారు. వాలంటైన్ వీక్‌లో భాగ‌మైన `హ‌గ్ డే` సంద‌ర్భంగా టీమ్‌లోని పురుషుల‌ని ఆలింగ‌నం చేసుకుంటూ శుభాకాంక్ష‌లు తెలిపిన‌ న‌రేష్..హీరోయిన్ శివానీ నాగారం, యాంక‌ర్ చొక్కార‌పు స్రవంతికి మాత్రం విషేస్ తెలియ‌జేస్తూ వారి వ‌స్త్ర‌ధార‌ణ‌ను ప్ర‌స్తావించారు. `మిమ్మ‌ల్ని కూడా హ‌గ్ చేయాల‌నే వ‌చ్చా. కానీ మీరు ల‌క్ష‌ణంగా చీర‌లు ధ‌రించారు` అని చెప్పుకొచ్చారు. దీంతో శివాజీ వ్యాఖ్య‌లు గ‌తంలో దుమారం రేపినా మెల్ల మెల్ల‌గా ఇండ‌స్ట్రీలో మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాయ‌ని న‌రేష్ వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్ట‌మైంది.