Begin typing your search above and press return to search.

శివన్న మీద దృష్టి పెడుతున్న మేకర్స్..!

ఆల్రెడీ కన్నడలో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్న శివన్న తెలుగులో స్పెషల్ రోల్స్ చేస్తారా అన్నది డౌటే. కానీ మల్టీస్టారర్ లేదా సినిమాలో ఈక్వల్ రోల్స్ ఉండే కథలకు ఓకే చెప్పే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 8:09 AM GMT
శివన్న మీద దృష్టి పెడుతున్న మేకర్స్..!
X

కన్నడ స్టార్ హీరో శివన్న అలియాస్ శివ రాజ్ కుమార్ తన సినిమాలతో కేవలం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ ని కూడా అలరిస్తూ వచ్చారు. శివ రాజ్ కుమార్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. ఆర్జీవి డైరెక్షన్ లో వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో శివ రాజ్ కుమార్ నటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినికాంత్ జైలర్ సినిమాలో కూడా శివ రాజ్ కుమార్ ఒక చిన్న పాత్రలో సర్ ప్రైజ్ చేశారు.

శివ రాజ్ కుమార్ తో పాటుగా మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా జైలర్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే జైలర్ లో శివ రాజ్ కుమార్ తెలుగు ఆడియన్స్ ని మెప్పించాడు. ఆయనను చూసిన తెలుగు మేకర్స్ శివన్నని ఇక్కడ సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటింపచేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ కన్నడలో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్న శివన్న తెలుగులో స్పెషల్ రోల్స్ చేస్తారా అన్నది డౌటే. కానీ మల్టీస్టారర్ లేదా సినిమాలో ఈక్వల్ రోల్స్ ఉండే కథలకు ఓకే చెప్పే అవకాశం ఉంది.

ఆల్రెడీ బాలకృష్ణ శివ రాజ్ కుమార్ కలిసి ఓ సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేశారు. ఆ సినిమా కథ ఏంటి డైరెక్టర్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈలోగా శివ రాజ్ కుమార్ కి తెలుగు మేకర్స్ నుంచి ఒకటి రెండు ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాల విషయంలో శివ రాజ్ కుమార్ నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉందట. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న తెలుగు సినిమాల్లో శివ రాజ్ కుమార్ కూడా భాగం అయితే సినిమా రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఏ సినిమా పడితే ఆ సినిమా అన్నట్టు కాకుండా తన ఇమేజ్ కి తగిన పాత్ర చేస్తే మాత్రం శివన్న కచ్చితంగా సినిమాకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. శివ రాజ్ కుమార్ కచ్చితంగా రాబోయే తెలుగు సినిమాల్లో చూసే అవకాశం ఉందని అంటున్నారు. మరి మల్టీస్టారర్స్ గా చేస్తారా లేదా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ కి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా శివ రాజ్ కుమార్ టాలీవుడ్ ఎంట్రీ ఆయన్ని అభిమానిస్తున్న ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు.