మొత్తానికి శివ నిర్వాణ అక్కడ తేలుతున్నాడా?
'ఖుషీ' తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ ఇంత వరకూ కొత్త సినిమా ప్రకటించని సంగతి తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అయి రెండేళ్లుసమీపిస్తుంది.
By: Tupaki Desk | 6 Jun 2025 2:00 PM IST'ఖుషీ' తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ ఇంత వరకూ కొత్త సినిమా ప్రకటించని సంగతి తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ అయి రెండేళ్లుసమీపిస్తుంది. దీంతో శివ ఏమైపోయాడు? వరుస హిట్లు ఇచ్చిన డైరెక్టర్ కి అవకాశాలు రాలేదా? అన్న అంశం చర్చకొచ్చింది. కానీ అసలు సంగతేంటి అంటే హీరోలంతా బిజీగా ఉండటంతోనే సినిమాలు చేయలేదన్నది వాస్తవం. బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఖాళీగా ఉంటున్నారు.
స్టార్ హీరోలంతా కమిట్ అయిన చిత్రాలతో బిజీగా ఉంటున్నారు. టైర్ 2..మీడియం రేంజ్ హీరోలు కూడా ఖాళీగా లేరు. వాళ్లకు ఉండాల్సిన కమిట్ మెంట్స్ వాళ్లకున్నాయి. దీంతో హిట్లు ఇచ్చినా డైరెక్టర్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా శివ నిర్వాణ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమాకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మంచి స్టోరీ వినిపించి రామ్ ని లాక్ చేసారట. రామ్ తదుపరి పట్టాలె క్కించే ప్రాజెక్ట్ఇదేనని సమాచారం.
ప్రస్తుతం రామ్ 'ఆంధ్రాకింగ్ తాలూకా' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ కు స్పూర్తి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్న అంశం. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడంతో? ఆయన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు. అటుపై అది ప్రాంతాలను బట్టి ఎవరికి వారు మార్చుకున్నారు. ఆ రకంగా తాలూకా అన్నది బాగా ఫేమస్ అయింది.
క్యాచీగానూ ఉండటంతో? రామ్ సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసారు. ఈ సినిమా తర్వాతే శివ నిర్వాణ చిత్రానికే రామ్ డేట్లు ఇస్తాడని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
