Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ ఏమయ్యాడు.. ఏం చేస్తున్నాడు..?

అదే ఫ్లాప్ లు తీస్తుంటే అతని వంక చూడరు. ఐతే హిట్లు ఫ్లాపులతో డైరెక్టర్ ప్రతిభని డిసైడ్ చేయలేం కానీ అతని ఫలితాల వల్ల నిర్మాతలు ఎవరు ముందుకొచ్చి ధైర్యం చేయ్యలేరు.

By:  Tupaki Desk   |   6 May 2025 3:00 AM IST
What Happened to Shiva Nirvana After Khushi?
X

సక్సెస్ ఉంటే వరుస ఛాన్స్ లు వస్తాయి.. అదే ఫెయిల్యూర్స్ అవుతుంటే అవకాశాలు రావడం కష్టమే.. ఇది కేవలం హీరో హీరోయిన్స్ విషయంలోనే కాదు డైరెక్టర్స్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. హిట్ సినిమా ఇచ్చిన డరెక్టర్ అంటే చాలు దర్శక నిర్మాతలు క్యూ కడతారు. అదే ఫ్లాప్ లు తీస్తుంటే అతని వంక చూడరు. ఐతే హిట్లు ఫ్లాపులతో డైరెక్టర్ ప్రతిభని డిసైడ్ చేయలేం కానీ అతని ఫలితాల వల్ల నిర్మాతలు ఎవరు ముందుకొచ్చి ధైర్యం చేయ్యలేరు.

కెరీర్ మొదట్లో డైరెక్టర్ గా సక్సెస్ లు ఇచ్చినా ఆ తర్వాత ఆడియన్స్ అంచనాలకు తగిన సినిమాలు ఇవ్వకపోతే అతన్ని పక్కన పెట్టేశ్తారు. సో అలా అయితే కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది. ప్రస్తుతం అలా నెక్స్ట్ సినిమా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. నిన్ను కోరి నుంచి ఖుషి సినిమా వరకు శివ నిర్వాణ సినిమాలు కొన్ని ప్రేక్షకులను మెప్పించగా మరికొన్ని అంచనాలను అందుకోలేకపోయాయి.

అందుకే ఆ డైరెక్టర్ కి ఇప్పుడు అవకాశాలు లేకుండా పోయాయి. 2023 లో నిన్ను కోరి రాగా ఆ సినిమా తర్వాత అతనికి మరో ఛాన్స్ రాలేదు. నానితో ఏకంగా రెండు సినిమాలు చేసిన శివ నిర్వాణ ఇలా ఖాళీ అవ్వడం షాక్ ఇస్తుంది. శివ నిర్వాణ కథలు చాలా సహజంగా ఉంటాయి. మొదటి సినిమానే పెళ్లైన హీరోయిన్ ఇంట్లో హీరో వెళ్లి ఉండటం లాంటి క్రేజీ థాట్ తో సినిమా చేశాడు.

ఖుషి కూడా కొంత మేరకు బాగానే అనిపించినా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే శివ నిర్వాణ కూడా ఈసారి అలా ఇలా కాకుండా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉండాలని చూస్తున్నాడు. మరి అది సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి. శివ నిర్వాణ కొత్త సినిమా ఎవరితో ఉంటుంది. అతని నెక్స్ట్ సినిమా విషయాలు ఏంటి అన్నది తెలుసుకోవాలని ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఐతే శివ నిర్వాణ మాత్రం ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదు. నెక్స్ట్ సినిమా అప్డేట్ తో గ్రాండ్ అనౌన్స్ మెంట్ తో సర్ ప్రైజ్ చేస్తాడేమో చూడాలి. నాని ఎలాగు ఇప్పుడు వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్నాడు. మరి శివ కెరీర్ కు నాని ఏదైనా హెల్ప్ చేస్తాడేమో చూడాలి. ఐతే నెక్స్ట్ సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని మాత్రం తెలుస్తుంది.